Friday 14 June 2013

DR.PAVULURI KRISHNA CHOWDARY GARU - RENOWNED HOMEO PHYSICIAN - ANDHRA PRADESH



మనరాష్ట్రంలో హోమియోపతి వైద్యం అంటే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి
పావులూరి కృష్ణ చౌదరి. హోమియో వైద్య వ్యాప్తికి ఆయన ఎంతో కృషి చేశారు.
ఈరోజున రాష్ట్రంలో ఆ వైద్య విభాగానికి ప్రత్యేక ఆసుపత్రులూ వైద్యులు పెరిగారంటే
ఆయన స్ఫూర్తితోనే. తన జీవితంలోని కొన్ని సంఘటన..

నాకు మొదట్నుంచీ వైద్య రంగానికి రావా
లన్న ఆలోచనే లేదు. ఆ మాటకొస్తే నేను
జీవశాస్త్ర విద్యార్ధినే కాను. డిగ్రీలో భౌతికశాస్త్రం,
రసాయనశాస్త్రం, గణితం చదివాను. తరువాత
ఎమ్.బి.బి.ఎస్.లో చేరాను. కానీ, మళ్లీ
అల్లోపతి నుంచి హోమియో వైపు వచ్చేశాను.
అయితే, ఈ రంగంవైపు మనసు మళ్లడానికి
చాలా కారణాలున్నాయి. నాకు చిన్నప్పట్నుంచీ
స్వతంత్రభావాలు ఎక్కువ. సొంతంగా బతకాలి
అన్న పట్టుదల ఉండేది. నా చిన్నతనంలో
మా గ్రామంలో చోటుచేసుకున్న కొన్ని సంఘట
నలే ఇందుకు స్ఫూర్తి కావొచ్చు.
ఊరిలో ఉద్యమాలు
నా జన్మస్థలం గుంటూరుజిల్లా అమృతలూరు
మండలంలోని గోవాడ గ్రామం. మాది మధ్య
తరగతి రైతు కుటుంబం. ఆరోజుల్లోనే మా
కుటుంబంలోని వారందరూ కాస్తో కూస్తో
చదువుకున్నవారే. మా తాతగారైతే దాశరథి
శతకాన్ని ఇట్టే వల్లె వేసేవారు. ఇక, ఊళ్లోని
పెద్దలందరూ సంస్కరణలపట్ల ఆసక్తి ఉన్న
వారు. ఆరోజుల్లో గ్రంథాలయ ఉద్యమం
మా ఊళ్లో చురుగ్గా సాగేది. అప్పటికి నేను
బాగా చిన్నవాణ్ని. మొదట్లో గ్రంథాలయానికి
నిధుల కోసం ప్రతి ఇంటికీ ఒక బుట్ట ఇచ్చి
రోజూ అందులో పిడికెడు బియ్యం వెయ్యమనే
వాళ్లు. నెలకోసారి ఆ బియ్యాన్ని అమ్మేసి
పుస్తకాలు కొనేవాళ్లు. ఇదే కాకుండా, రైతు
ఉద్యమం, హిందీ ప్రచార ఉద్యమం... ఇలా
ఎన్నో ఉద్యమకార్యక్రమాలు నా చిన్నప్పుడు
ఊరిలో జరుగుతుండేవి. మా ఊరి గ్రంథా
లయానికి రాజరాజ నరేంద్రుడి పేరు పెట్టారు.
మా బడి పేరు బాలభారతి ప్రాధమిక పాఠ
శాల. మా పాఠశాలలో కూడా ప్రోత్సాహకర
మైన వాతావరణం ఉండేది. అక్కడో
ప్రధానోపాధ్యాయుడు ఉండేవారు. బతకలేక
బడిపంతులు అంటారే... ఆయన అలా
కాదు. దేశానికి ఉపయోగపడేలా విద్యార్థుల్ని
తయారు చెయ్యాలి అన్న పట్టుదల
ఆయనకి ఉండేది.
అక్కడ మొదలు
తరువాత గుంటూరులోని ఏసీ కాలేజీలో
చేరాను. అక్కడ చదువుతున్న రోజుల్లో వ్యాస
రచన అంటే ఆసక్తి ఉండేది. మాకు కాలేజీ
చీ మ్యాగజైన్ ఉండేది. దానికి సంపాదకుడిగా
ఎన్నికై బాధ్యతలు నిర్వహించాను. కాలేజీ
జీవితం అలా అలా గడిచిపోయింది. ఆ తరు
వాత ఏం చెయ్యాలన్నది పెద్ద ప్రశ్న. అప్పుడు
ఇంజినీరింగ్... ఎమ్మెస్సీ... మెడిసిన్లకు
అప్లై చేశాను. ఇంజినీరింగ్, ఎమ్మెస్సీల్లో సీట్లు
వచ్చాయి. దేనిలో చేరాలీ అన్న మీమాంస.
ఇంజినీరింగ్ లో చేరితే... పూర్తయ్యాక
ఉద్యోగం చెయ్యాలి. నాకేమో ఉద్యోగం
చెయ్యడం ఇష్టం లేదు. అదే ఎమ్మెస్సీలో
చేరితే తరువాత ఓ ట్యుటోరియల్ కాలేజీ
పెట్టుకోవచ్చు అనుకున్నాను. అందుకే ఇంజినీ
రింగ్ వద్దనుకుని వైజాగ్ వెళ్లి ఎమ్మెస్సీలో
చేరాను. ఆ వెంటనే మెడిసిన్లో సీటు
వచ్చింది. డాక్టరైతే ఓ చిన్న క్లినిక్ పెట్టుకొని
సొంతంగా బతికేయడం సులువు
అనిపించింది. ఆలా మెడిసిన్లో చేరానే తప్ప,
చే వైద్యరంగం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి అంటూ
ఏమీ లేదు.
హోమియో పరిచయం
మెడిసిన్ చదువుతున్నప్పుడు నాకో స్నేహి
తుడు ఉండేవాడు. పేరు శ్రీరామ్. వాళ్ల నాన్న
గారు అప్పట్లో గుంటూరు జిల్లా వైద్యాధికారిగా
పనిచేస్తుండేవారు. ఆయన ఎమ్. బి.బి.ఎస్.
చదివి హోమియోపతి వైద్యం చేస్తుండేవారు.
'మీ నాన్నగారు ఎమ్.డి. చేసుకోవచ్చుగా.
ఈ హోమియోపతి ఎందుకూ' అని శ్రీరామ్
అంటుండే వాణ్ని. 'ఆ వైద్యం సంగతి నీకు
తెలీదులే అనేవాడు. తరగతి గదిలో మా పక్కనే
కూర్చునే ఓ మిత్రుడికి జ్ఞానదంతం వచ్చింది.
దాంతో విపరీతమైన నొప్పి భరించలేకపోయే
వాడు. వాడిని శ్రీరామ్ వాళ్ల నాన్న దగ్గరకి
తీసుకెళ్లాడు. నేనూ వాళ్లతో వెళ్లాను. ఆయన
ఏవో రెండు గోళీలు ఇచ్చారు. మర్నాటికి
బాధ తగ్గిపోయింది. ఆ సంఘటన నా మన
సులో ఏమూలో నాటుకుపోయింది. అప్పట్లో
గుంటూరు మెడికల్ కాలేజీలో ఎమ్. బి. బి. ఎస్.
కోర్సులో మొదటి రెండేళ్లు మాత్రమే ఉండేది.
దీన్ని ప్రీ క్లినికల్ కోర్సు అనేవారు. తరువాతది.
క్లినికల్ కోర్సు దానికోసం వైజాగ్ లేదా
మద్రాస్ వెళ్లి చదవాల్సివచ్చేది. కాబట్టి
మా బ్యాచ్ లో కొందరు ఆటూ కొందరు ఇటూ
వెళ్లిపోయారు. ఆలా నేను వైజాగ్ కి వెళ్లాను.
శ్రీరామ్ మద్రాస్ వెళ్లాడు. తరువాత మా
మధ్య సంబంధాలు తెగిపోయాయి. వైజాగ్ లో
ఉన్న రోజుల్లో ఈస్నోఫీలియా పట్టుకుంది.
తుమ్ములూ దగ్గులూ చాలా చికాగ్గా ఉండేది.
ఎన్ని మందులు వాడినా నయం కాలేదు.
మూడు పొట్లాలు!
మెడిసిన్ పూర్తి చేసుకుని మా ఊరికి
దగ్గర్లోనే ఉన్న పొన్నూరులో ఆసుపత్రి ప్రారం
భించాను. ఆచార్య ఎన్జీ రంగా అంటే నాకు
చాలా అభిమానం. ఆయనే నా ప్రాక్టీసును
ప్రారంభించారు. తరువాత కొన్నాళ్లు గడిచాయి.
ఇంకా ఈస్నోఫీలియా వదల్లేదు. అప్పుడు
శ్రీరామ్ గుర్తొచ్చాడు. అతను అప్పటికే
లండన్లో హోమియోపతి చదివి వచ్చాడు.
అతణ్ని సంప్రదించి నా సమస్య చెబితే ఏవో
మూడు పొట్లాలు పంపించాడు. అవి వాడగానే
ఈస్నోఫీలియా తగ్గిపోయింది. అప్పుడు
హోమియోపతిపై ఆసక్తి కలిగింది. నాకు పీజీ
కోర్సు చేయాలని ఉండేది. అది హోమియో
పతిలో చేద్దాం అనిపించింది. ఇదే మాట
శ్రీరామ్ కి చెబితే ప్రోత్సహించాడు. అతడు
తిరుచినాపల్లిలో ఉండేవాడు. అప్పుడప్పుడూ
అక్కడికి వెళ్లి నాల్రోజులుండి కొన్ని విష
యాలు తెలుసుకుని వచ్చేస్తుండేవాణ్ని. తరు
వాత లండన్ వెళ్లి హోమియోపతి నేర్చుకోవా
లని నిర్ణయించుకున్నాను. అయితే, పొన్నూరు
లోని ఆసుపత్రిని లండన్ వెళ్లకముందే
మూసేయాలా... తిరిగొచ్చాక మూయాలా
అన్న డోలాయమానం. అలానే లండన్ వెళ్లి
పోయాను. అక్కడ మెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్కా
హోమియోపతి (ఎమ్.ఎఫ్.హోమ్) చేస్తున్న
ప్పుడే హోమియోపై మరింత అభిమానం
పెరిగింది. మనదేశంలో కూడా దీనికి మంచి
ఆదరణ ఉంటుంది అనిపించింది. పొన్నూరు
లోని ఆసుపత్రి మూసేద్దామని అక్కడే నిర్ణ
యించుకున్నాను. తిరిగి వచ్చాక నేను చేసిన
మొదటిపని అదే. అలా నా అల్లోపతి ఆసు
పత్రి మూసేసి... గుంటూరులో హోమియో
పతి వైద్యం మొదలు పెట్టాను. ఎంతోమంది
రాజకీయ, సినీరంగ ప్రముఖులు నా దగ్గరకి
వైద్యానికి వస్తుండేవారు. క్రమంగా గుంటూరు
జిల్లాలోనే కాకుండా ఆంధ్రదేశంలోనే
హోమియో ప్రాక్టీషనర్రం
గా గుర్తింపు వచ్చింది.
అప్పుడే మారింది
అప్పట్లో ఎమ్.టి. రాజుగారు రాష్ట్ర ప్రభుత్వ
ప్రధానకార్యదర్శిగా ఉండేవారు. ఆయన భార్యకి
క్యాన్సర్ అని ప్రముఖ ప్రభుత్వ వైద్యులు
కొందరు అభిప్రాయపడ్డారు. ఆమెని బాంబేలోని
టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్ళామను
కున్నారు. ఈలోగా నా గురించి తెలిసి ఆయన
హైదరాబాద్ నుంచి గుంటూరుకి వచ్చారు.
నేను ఆమెకి వైద్యం చేశాను. ఆమెకి రెండు
నెలల్లోనే సంపూర్ణంగా నయమైపోయింది.
దాంతో చాలామంది మీరు హైదరాబాదు
వచ్చేయండని కోరారు. అదే సమయంలో
హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలవారు
కూడా ప్రిన్సిపాల్ గా రమ్మన్నారు. అలా
1988లో హైదరాబాద్ వచ్చేశాను. వైద్యం
పెరగాలంటే మంచి కళాశాలలు ఉండాలి.
మంచి ఆసుపత్రులు, సరైన శిక్షణ
ఉండాలి. ప్రభుత్వ సహ
వమ్ కూడా తోడవ్వాలి. ఇవన్నీ సమకూరితే
హోమియోపతికి ఆదరణ పెరుగుతుందన్న
నమ్మకంతో కళాశాలలో చేరాను. కానీ, నా
కలలు నెరవేరలేదు. ఆ హోమియో కాలేజీని
ప్రభుత్వం తీసుకున్నా సహకారం ఆరకొరగానే
ఉంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించినా నా
ఆలోచనలు అమలుకాలేదు. దాంతో కాలేజీ
నుంచి 1978లో బయటకి వచ్చేశాను. నిజానికి
కాలేజీలో పనిచేసిన ఆ పదేళ్లలోనే వివిధ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పదవులు నిర్వహిం
చాను. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియో
పతికి సభ్యుడిగా, భారత ప్రభుత్వ డ్రగ్స్
టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గా,
కలకత్తాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
హోమియోపతిలో పాలక విభాగ సభ్యుడిగా,
భారత రాష్ట్రపతికి ఫిజీషియన్‌గా, ఆంధ్రా
బోర్డ్ ఆఫ్ హోమియోపతిలో సభ్యుడిగా....
పని చేశాను. ఇలా ప్రభుత్వం నుంచి నాకు
తగిన గుర్తింపు కూడా లభించింది. అంతా
బాగానే ఉంది. కానీ, కాలేజీలో మాత్రం
నేను అనుకున్నది జరగలేదన్న అసంతృప్తి
ఉండేది. హోమియో వైద్యానికి చేయగలిగి
నంత చేయలేకపోయానని బాధ,
గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వం ల్యాబొ
రేటరీలాంటి సదుపాయాలు కల్పించి ఏనాటికీ
వైద్యం అందించలేదన్నది నా అభిప్రాయం.
హోమియో ద్వారానే మేలైన వైద్యం
అందించొచ్చు అని నాకు అనిపించింది.
అందుకే ఎలాగైనా హోమియోపతిని ప్రజల్లోకి
తీసుకెళ్లాలి' అన్న పట్టుదల పెరిగింది.
ఓసారి రామోజీరావుగారితో నా ఆలోచనలు
పంచుకున్నాను. 'ఈనాడు' పత్రికలో వ్యాసాలు
రాస్తానండి అని అడిగాను. ఆయన అనుమ
తించారు. ఆలా 1980లలో మొదలై దాదాపు
దశాబ్దానికి పైగా ప్రతి ఆదివారం వ్యాసాలు
రాశాను. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం
కూడా సమితుల్లో చాలామంది హోమియో
వైద్యులను నియమించింది. నేను
హైదరాబాద్ కి వచ్చిన కొత్తల్లో 180 మంది
ప్రభుత్వ హోమియోపతి
వైద్యులు ఉండేవారు. రెండు దశాబ్దాలు
గడిచేసరికి ఆ సంఖ్య 500కి పెరిగింది.
1994లో మెడ్విన్ ఆసుపత్రివారి సహకా
రంతో మనదేశంలో మొట్టమొదటిసారిగా
అల్లోపతి వైద్యులకు ఇంగ్లండు తరహాలో
ఎమ్. ఎఫ్ హోమ్ కోర్సును హైదరాబాద్లో
ప్రారంభించాను. ఈ కోర్సుకు పార్లమెంటు
యాక్టు ద్వారా గుర్తింపు ఉంది. ప్రతీయేటా
అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న వైద్యులు
శిక్షణ పొందుతున్నారు. అప్పటి నుంచి
ఈ కోర్సును విజయవంతంగా నిర్వహిస్తు
న్నందుకు ఫ్యాకల్టీ ఆఫ్ హోమియోపతి,
ఇంగ్లండ్ వారు ఎఫ్.ఎఫ్.హోమ్ డిగ్రీని
నాకు ప్రదానం చేశారు. ఇది నాకు
ప్రపంచస్థాయి గుర్తింపు.
హోమియో వైద్యంలో వ్యాధి. వ్యాధి
గ్రస్థుడు... రెండిటికీ ప్రాధాన్యముంటుంది.
వ్యాధిగ్రస్థుని లక్షణాలపై ఆధారపడి...
వ్యాధి లక్షణాలను కూడా దానికి జోడించాక
ఔషధాలను ఇవ్వడం హోమియో విధానం.
వ్యాధి గ్రస్థుని లక్షణాలను కూడా పరిగణనలోకి
తీసుకోవడం వల్ల వ్యాధులు తిరగబెట్టవు.
ఈ సత్యాన్ని ప్రజలు గుర్తిస్తే హోమియో
వైద్యం పట్ల నమ్మకం ఏర్పడుతుందని
ఓసారి చినజీయరు స్వామివారికి
ఓ ప్రమాదంలో తీవ్రగాయాలయ్యాయి.
ఆయనకి హోమియో వైద్యమంటే అభిమానం.
అప్పుడు ఆయనకి నేను వైద్యం చేశాను.
అప్పట్నుంచీ ఆయనకి నాపై నమ్మకం
* కుదిరింది. త్వరలోనే ఆయన సహకారంతో
జీయర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సర్వీసెస్
(జిమ్స్)ను ప్రారంభించబోతున్నాం. పేదలకు
వైద్యం అందించాలన్న ఉద్దేశంతో లాభాపేక
లేకుండా సేవలందించే సంస్థ ఇది.
నా భావన.


ప్రశాంతతే ఆరోగ్యం
1980లలో మా పెద్దబ్బాయి మరణించాడు.
అప్పుడు చాలా రోజులు నిద్రపట్టలేదు.
విద్రకి ఏ మందులు వాడలేదు. కపాలు
వస్తుంటాయి... అని సర్ది చెప్పుకుని మన
సును పత్రికా రచదివైపు మళ్లించామని,
మా రెండో కుమారుడు అమెరికాలో చిల్డ్రన్స్
స్పెషలిస్టు నా కుమార్తె కూతురు... అంటే
నా మనవరాలు దా, అపర్ణ.. నాలాగే
ఎమ్.చి, వి. ఎస్. చేసి తరువాత ఎమ్.ఎఫ్.
హోమ్ చదివింది. ప్రస్తుతం నాకు
సహాయంగా ఉంటోంది. ఇక, నా దినచర్య
తెల్లవారుజామున నాలుగు గంటలకే
మొదలౌతుంది. ఓ గంటసేపు వడక,
ఆ తరువాత ఎనిమిది గంటల వరకూ ఏదో
ఒకటి చదువుతుంటాను. నాకైనా ఎవరి
పైనా ఆరోగ్య రహస్యం ఒక్కటే... ఏ చెడు
ఆలోచనల్ని బుర్రలోకి రానీయకూడదు.
వీలైనంత ప్రశాంతంగా బతకాలి.

ఆ నమ్మకమే

లండన్లో నాకు శిక్షణ ఇచ్చిన అధ్యాపకులందరూ
ప్రపంచ ప్రఖ్యాత వైద్యులు. డా॥ ఎం.జి. బ్లాకీ, ఫూబిస్టర్,
ఎలిజబెత్ రైట్ హబర్డ్ లాంటి హేమాహేమీల క్లాసులు వింటుంటే
హోమియోపతిపై నమ్మకం పెరిగింది. మరోపక్క... అప్పటి
ఇంగ్లండ్ సామాజిక పరిస్థితులు కూడా నన్ను ఆలోచింపజే
శాయి. అప్పటికే రెండో ప్రపంచయుద్ధంలో ఆ దేశం చాలా
కోల్పోయింది. ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయింది. ప్రభుత్వమే
ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేది. వైద్యులు కూడా ప్రభుత్వం
ఇచ్చే జీతంతోనే బతికేవారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాకు
శిక్షణ ఇచ్చే హోమియోపతి డాక్టర్లుకు ప్రజాదరణ బాగానే ఉండేది.
ప్రజలు ఫీజులు చెల్లించి మరీ వాళ్ల దగ్గర వైద్యం చేయించుకునే
వారు. ఇవన్నీ చూశాక మనదేశంలో హోమియోకి ఆదరణ
లభిస్తుందన్న ఆత్మవిశ్వాసం కలిగింది.




నమస్కారం కృష్ణచౌదరి గారు
పావులూరి కృష్ణ వాదం సమస్వాము
ఆర్కే ఇప్పుడు తొంభై ఏళ్ల?
పావులూరి 89
ఆ మాకన్నా యాక్టివ్ గా కనిపిస్తున్నారు.
పావులూరి: యూజ్ ఎట్ ఆర్ డాట్ ఇట్ అని బయాల
లో ఒక ప్రిన్సిపల్ ఉంది. అందుకే నేను నా బాడీని
ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుతాను. లేకపోతే బయాలజిక
లేగా మెంటల్ గా చాలా కోల్పోవాల్సి వస్తుంది.
ఆర్కే ఈ ఆరోగ్యం, చలాకీతనం వ్యక్తిగత క్రమశిక్షణ
వల్ల వచ్చిందా? లేక హోమియో మందుల వల్ల
వచ్చిందా?
పావులూరి. రెండింటి ప్రభావం ఉంది. హోమియో
వైద్యాన్ని ఒక ద్యేయంగా మొదలు పెట్టాను. త్రిపురనేని
రామస్వామి చౌదరి ప్రభావం నాపై చాలా ఉంది. ఆయన
హేతువాది. ఒకరకంగా చెప్పాలంటే చదువుకుని ఉద్యోగం
చేయకూడదనేది నా పిలాను. చదువుకుని విజ్ఞానం
సంపాదించుకోవాలి. ఆ విజ్ఞానంతో బతకాలి. ఆ దృష్టితోనే
ఎంఎస్సీ మెడిసిన్‌ కోర్సులకు అప్లై చేశా ఎంఎస్సీ కోర్సులో
సీబో, జాయిన్ అయ్యా ఎందుకంటే ఎంఎస్సీ హర్తి చేసి
ట్యుటోరియల్ కాలేజ్ పెట్టుకోవాలన్నది నా ఆలోచన
అయితే ఆ తరువాత మెడిసిన్లో కూడా నీటొచ్చింది. ఇంటి
కెళ్లి అమ్మానాన్నను అడిగా, అప్పటికే నాకు పెళ్లయింది. మాఫాదర్ ఒక్కటే అన్నారు. నువ్వేం చదవాలో నాకు తెలి
యదు కానీ, నువ్వేం చదవాలనుకున్నా నేను చదివిస్తా
అన్నారు. ఎంపిన వాళ్లకు మెడిసిన్ సీటివ్వడం మా బ్యాచ్
తోనే లాస్ట్ ఐదేళ్ల చదువు పూర్తయితే ప్రాక్టీస్ పెట్టుకోవ
చ్చని అనుకున్నా ఏదైనా బతుకు దెరువే. కానీ ఆ బతుకు
దెరువు కూడా మనసుకు నచ్చిందే చేయాలి.
ఆర్కే: హోమియో వైపు రావాలనే మీ నిర్ణయంపై
ఇంట్లో ఏవైనా గొడవలు జరిగాయా?
పావులూరి. నలుగురికీ మేలు చేయడానికి ఏది వీలైతే
అదే చేయమని నా ధర్మపత్ని చెప్పేది. ఇంటిపోరు లేదు.
కెంట్ రిపర్టీ అనే పుస్తకం ఉండేది. ఇప్పుడు మార్కెట్లో
లేదు. దాని ధర అప్పట్లో 150 రూపాయలు. సవరు
బంగారం ధర 55-60 రూపాయల మధ్య ఉండేది. ఆ
పుస్తకం ఒక కాపీ ఇంట్లో, ఒక కాపీ హాస్పిటల్లో, మూడో
కాపీ కారులో ఉండేది. మీకు చాదస్తం ఎక్కువని నా భార్య
అనేది. పిల్లలను విద్యావంతుల్ని చేస్తే వాళ్ల సంపాదన
వాళ్లు సంపాదించుకుంటారని చెప్పేవాడిని. ఆ రకంగా
నాకు ఇంట్లో సపోర్ట్ బాగానే ఉండేది.
ఆర్కే ఇప్పటికీ అల్లోపతి డాక్టర్లు హోమియోను
వైద్యంగా అంగీకరించడం లేదు. మరి వీళ్ల మధ్య
సాపత్యం ఎలా కుదురుతుంది?
పావులూరి: నేను హోమియోపతి తీసుకున్న తర్వాత
మొట్టమొదటగా చేసిన పని నా టేబుల్ మీద నుంచి
స్టెతస్కోప్ తీసేశాను. బిపి చూసేవాడిని కాదు ఏ రిపోర్టు
రాసేవాడిని కాదు. ఇవ్వన్నీ ఎందుకు తీసేశారని ఎవరైనా
అడిగితే ఈ పనులు చేసేవాళ్లు డాక్టర్లు మా వీధిలోనే పది
మంది ఉన్నారని చెప్పేవాడిని నేను చేసే విధానంతో మీకు
మేలుగా ఉందో లేదో చెప్పండి. బిపి తగ్గినా వ్యాధి పోయి
నట్టు కాదు. రెండు రోజులు మాత్రలు వేసుకోకపోతే బిపి
మళ్లీ వస్తోంది. వ్యాధి తగ్గిందా లేదా అనేదే ప్రధానం bp
చూశామా లేదా అనేది కాదు.
ఆరే పేషెంట్ కు బిపి చూడకుండా మందు ఎలా
ఇస్తారు?
పావులూరి: మీరు బివి పేషెంట్ అని నా దగ్గరకు వస్తు
న్నారు. కాబట్టి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. బిపి
చూడటం తప్పని నా ఉద్దేశం కాదు. పేషెంట్ మాటలను,
బిపి లక్షణాలను బట్టి తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతివాళ్లు
మనం చెప్పినా చెప్పకపోయినా బిపి చూపించుకుంటూనే
ఉన్నారు.
ఆరే గుండె జబ్బులకు సంబంధించి.. వాల్వ్ లో
వచ్చే బ్లాకు మందులతో క్లియర్ చేయగలరా?
పావులూరి: బాక్స్ క్లియర్ చేయలేం. కానీ కాంపెన్సేట్
చేస్తాం అంటే హార్ట్ ఎటాక్ రాకుండా ఉపశాంతికి ఉపయో
గపడేలా మందులు ఇవ్వగలు,
ఆర్కే. చాలా సందర్భాల్లో చివరి అవకాశంగా
హోమియో వైపు వస్తున్నారు కదా?
పావులూరి: అవును. పరిస్థితి కొంత మారినా.. ఇప్పుడు
జరుగుతున్నది. అదే ముఖ్యంగా మన దేశంలో విద్యావం
తులు, ఆవిద్యావంతులు అని రెండు తరగతులు తీసు
కుంటే.. అవిద్యావంతులకు దీని గురించి తెలియదు. విద్యా
వంతుల సపోర్ట్ ఉంటే ఇది బతుకుతుంది. ఇప్పుడు మాకు
వారి సపోర్ట్ దొరికింది.
ఆర్కే హోమియోలో అన్ని రకాల ఎలిమెంట్సను ట్రీట్
చేయడం సాధ్యం కాదని మీరు చెబుతున్నా... చాలా
మంది వైద్యులు అన్ని చేయగలం అని చెబుతు
న్నారు కదా?
పావులూరి. అది వ్యాపార సరళి. కానీ వాస్తవం కాదు.
అన్ని రకాల ఎలిమెంట్సన్ను ట్రీట్ చేయడం సాధ్యమైతే నేను
ఇంటిగ్రేటివ్ మెడిసిన్ సపోర్ట్ పెట్టను. హోమియోలో
సాధ్యం కాకపోతే రోగిని దృష్టిలో పెట్టుకొని అల్లోపతిని
ఇన్వాల్వ్ చేయాలి. కానీ ఇలా చెప్పడం కమర్షియల్
హోమియోపారు నచ్చదు. హోమియోపతికి పరిమితులు
ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. ఎంపిక చేసిన
జబ్బులకు మాత్రం దివ్యంగా పనిచేస్తుంది. తక్కువ
ఖర్చుతో ఎక్కువ బాధలు తగ్గుతాయి. పది వర్టిగో కేసుల్లో
తొమ్మిది హోమియోలో కచ్చితంగా తగ్గుతాయి
అర్క మీ దగ్గరకు వైద్యానికి వచ్చే అల్లోపతి డాక్టర్లు
ఎందరుంటారు?
పావులూరి: నా దగ్గరకు చాలామంది ఆలోపతి డాక్టర్లు
వార్ల ఫ్యామిలీతో సహా వస్తుంటారు. నేను అల్లోపతి చదు
పుకోవడం ఒక కారణం కావచ్చు.

ఆర్కే ఎఎ రుగ్మతలకు హోమియో అద్భుతంగా పనిచే
స్తుంది?
పావులూరి ఇన్ఫెక్షన్లకు బాగా పనిస్తుంది. రెస్పిరేటరీ డిసీ
జెస్, ఆస్థమా, బ్రాంకైటిసు బాగా పనిచేస్తుంది. మైగ్రేన్,
పెరాలసిసకు హోమియోలో మంచి మందు ఉంది. నేటి
పూత, ఎసిడిటీ, గ్యాస్, అల్సర్స్ డయేరియా, నెర్వస్ సిస్ట
మకు సంబంధించిన వ్యాధులకు బాగా పనిచేస్తుంది.
మైండ్ డిస్ట్రబెను కూడా మంచి మందులున్నాయి. శరీ
రంలో ఉండే 12 వ్యవస్థల్లో సైకో, న్యూరో, ఎండోక్రైన్,
ఇమ్యూన్ సిస్టమ్స్ నాలుగింటిలో ఏ వ్యాధులు ఉన్నా
హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.

ఆర్కే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా హోమియోతో తగ్గు
తాయా?
పావులూరి వీటికి హోమియో చాలా మంచిది. వైట్
డిశ్చార్డ్, ఓవర్ బ్లీడింగ్ వంటి సమస్యలకు ఇది చాలా
మంచి వైద్యం.
ఆర్కే. మీ పిల్లలు...
పావులూరి పెద్దబ్బాయి దురదృష్టవశాత్తూ చనిపో
యాడు. రెండోవాడు అమెరికాలో చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. నా
మనుమరాలు (కూతురు కుమార్తె) ఎంబీబీఎస్ చేసి, నాతో
పాటు హోమియోపతి ప్రాక్టీస్ చేస్తోంది. రెండోవాడిని కావా
లనే ఎంబీబీఎస్లో చేర్చాను. ఎంబీబీఎస్ చేయకుండా
హోమియోపతి చేయకూడదు. ఉమ్స్ కాలేజీలో ఎండిలు,
ఎమ్మెతో పాఠాలు చెప్పిస్తున్నాం ఇక్కడి నుంచి
బయటకు వెళ్లబోయే విద్యార్థులు ఇండియాలోనే జెమ్స్
ఆర్కే మీకు ఎప్పుడైనా అల్లోపతి వైద్యం అవసర
మైందా?
పావులూరి: నాకు ఏదన్నా సమస్య వస్తే హోమియోపతి
తప్ప అల్లోపతి అవసరం రాలేదు. ఇప్పటివరకూ నేను ఏ
అల్లోపతి మందు తీసుకోలేదు. నేను ఆరోగ్యంగా ఉండటం
కూడా ఒక కారణం కావచ్చు.
ఆర్కే. తర్వాత ఎంప్లాన్ చేస్తున్నారు?
పావులూరి: జిమ్ లో అల్లోపతి డాక్టర్లకు హోమి
యోపతిలో శిక్షణ ఇస్తున్నాం దాన్ని పాపులరైజ్ చేయాలి
వాళ్లు కోర్సు పాసైన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రభుత్వం అభ్యం
తరపెట్టకూడదు. వాళ్లకు హోమియోపతి రిజిస్ట్రేషన్ కూడా
ఉండాలి దశ తెలిసి వైద్యం చేస్తే చాలావరకు
ఖర్చు తగ్గు
తుంది.

ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో నాకు ఇస్నోఫీలియా
సమస్య ఉంది. ఆ రోజుల్లో ఆ జబ్బుకి సంబంధం
చిన వివరాలు పెద్దగా తెలియవు కేన్సర్ ఆనుకుని
యాంటీ కేన్సర్ వైద్యం ఇచ్చిన సంఘటనలున్నాయి.
నేను వైద్యం తీసుకున్నా తగ్గలేదు. నా స్నేహితుని
తండ్రి హోమియో వైద్యుడు తను బీచిలో సెకల
య్యారు. ఆయనకు చెబితే రమ్మన్నారు. వెళితే
మూడు పొట్లాలు ఇచ్చారు. వేసుకుంటే సమస్య
పోయింది. అప్పుడే నాలో ఆలోచన మొదలయింది.
* ఇంగ్లండ్ లో రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఫ్రీ
ట్రీట్మెంట్ను ప్రారంభించారు. చికిత్స మందులు
అన్నీ ఉచితంగా అందించారు. అలాంటి పరిస్థితుల్లో
అక్కడ హోమియో వైద్యులు డబ్బులు తీసుకుని
వైద్యం అందించే వారు. అది కూడా నాపై ప్రభా
వాన్ని చూపింది. ఇంగ్లండ్ చెల్లి వచ్చాక ఆలోపతి
కొనసాగించాలా? హోమియోపతిని ఎంచుకోవాలా?
అని సందిగ్ధత మొదలైంది. చివరకు హోమియో
వైపే మొగు చూపాను. గుంటూరులో హోమియో
ప్రాక్టీస్ మొదలు పెట్టాను.
• హైదరాబాదు షిఫ్ట్ కావడానికి కారణం ఉంది.
అప్పుడు చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎంటి రాజు గారి
భార్యకి అనారోగ్యంగా ఉంటే డాక్టర్సతో ఒక కమిటీ
వేశారు. ఆ కమిటీ కేన్సర్ అని తేల్చింది. చికిత్స
కోసం టాటా మెమొరియల్, ముంబై తీసుకెళ్లాలని
సూచించింది. అప్పుడు మంత్రిగా ఉన్న తిమ్మారెడ్డి
ముంబైకి వెళ్లే ముందు గుంటూరులో ఉన్న
కృష్ణ చౌదరికి చూపించమన్నారట. నా దగ్గరకు తీసు
కొస్తే 12 వారాల్లో తగ్గించేశా. ఆ తరువాత నన్ను
హైదరాబాదు రావాలని ఎంటి రాజుగారు పట్టుల
ట్టారు. ప్రభుత్వం తరపున కావలసిన సపోర్టు
అంతా ఇస్తామన్నారు. దాంతో హైదరాబాద్ కు షిఫ్ట్
అయ్యాను.

పత్రిక ద్వారా ప్రజలకు

హోమియోలో మొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఇమ్ము
నిటీని పెంచడం ఇమ్యునిటీని పెంచితే వ్యాధి తగ్గు
తుంది. అల్లోపతి వాళ్లు వ్యాధిని మాత్రమే
చూస్తారు. హోమియోలో వ్యాధితో పాటు వ్యక్తిని
చూస్తాం. ఔషధం వ్యాధిని తగ్గించడంతో పాటు
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.
హైదరాబాదు వచ్చిన తరువాత హోమియోపతి
కాలేజ్ లో పదేళ్లపాటు పనిచేశాను. ఆ తరువాత
బయటకొచ్చి ప్రాక్టీస్ పెట్టాను. ఆ క్రమంలోనే
రామోజీరావుగారు పరిచయం అయ్యారు. ఆయనకు
హోమియో వైద్యం పై అభిమానం లేదు -
వాళ్ల అమ్మానాన్నలను చూడటానికి నన్ను ఏలిన
వారు. వారానికొకసారి వెళ్లి చూసే వారు కొంత
కాలం తరువాత ఆయనకు నా వైద్యంపై నమ్మకం
ఏర్పడింది. ఆ తరువాత ఒకసారి నేనే అడిగా
హోమియోపతి పత్రిక పెడతాను అని. ఆప్పుడా
యన పత్రిక పెట్టడమంటే పెద్ద తలనొప్పి. మన
పత్రికలో రాయండి. మన పత్రిక ద్వారా ప్రజల్లో
హోమియో వైద్యంపై అవగాహన కల్పిద్దాం
అన్నారు. సరే అన్నాను. అలా పత్రికలో ప్రశ్నలకు
సమాధానాలు ఇవ్వడం ప్రారంభమయింది.
చిన్నజీయర్ స్వామితో పరిచయం నా జీవితాన్ని
మార్చేసింది. ఒకసారి స్వామి గారికి రోడ్డు ప్రమా
దంలో గాయాలయ్యాయి. ఆయనకు ఇంజక్షన్ అంటే.
ఇష్టం ఉండదు. విజయవాడలో పెట్టారు. నన్ను
పిలిపించారు. ఇంజక్షన్లు లేకుండా హోమియో,
మందులతో పూర్తిగా తగ్గించా. దాంతో ఆయనకు
నాపై అభిమానం ఏర్పడింది. ఆయన అప్పటికే
ఎన్నో మార్గాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
వైద్యం కూడా అందించాలని సంకల్పించారు.
అప్పుడు నేను చెప్పాను ఇంటిగ్రేటెడ్ మెడికల్ సర్వీ
సెస్ హాస్పిటల్ పెడదాం అని. అల్లోపతి ఉంటే
హోమియో వైద్యం కోసం ఎవరొస్తారు అని కొందర
న్నారు. కానీ ఆసుపత్రి ప్రారంభించాక హోమియో
వైద్యం కోసం వచ్చిన వాళ్ల సంఖ్యే ఎక్కువ ఉంది.
ప్రజల్లోకి తొందరగా వెళ్లడం కోసమే జీయర్ ఇంటి
గ్రేటివ్ మెడికల్ సర్వీసెస్(జిమ్స్) అని పేరు
పెట్టాం.
* రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం
లోనే ప్రభుత్వ వైద్యుల పోస్టుల సంఖ్యను భారీగా
పెంచారు. హోమియో వైద్యం ప్రాచుర్యం పొందడా
నికి అది కూడా కారణం హోమియో వైద్యం కోసం
ఏం చేయమంటారు అని రామారావుగారు అడిగితే
"అల్లోపతి డాక్టర్లున్నారు కానీ, హోమియో, ఆయు
ర్వేద వైద్యులు లేరు. అసిస్టెంట్ డాక్టర్ల పోస్టులను
క్రియేట్ చేస్తే బాగుంటుంది" అని చెప్పడంతో
ఆయన వెంటనే మంజూరు చేశారు.
• హోమియో వైద్యం అందరికీ చేరువ కావాలనే ఉద్దే
శంతో 'ఇంటింటా హోమియో వైద్యం' పేరుతో పుస్త
కాన్ని రాశా. యాభై వేల పుస్తకాలు అమ్ముడుపో
యాయి.

* ఈ మధ్య ఒక అల్లోపతి డాక్టర్ను 'ప్రాక్టీస్ ఎలా ఉంద'ని అడిగాను. దానికి అయన
చెప్పిన సమాధానం... 'నాకు నెలకు 50 వేల వరకూ వస్తోంది. 25 వేలు ప్రాక్టీస్లో,
మరో 25 వేలు కిక్ బ్యాక్ (పరీక్షలకు ల్యాలు రాయడం ద్వారా వచ్చే సంపాదన)లో
వస్తోంది. హాయిగా ఉన్నాను' అని చెప్పాడు. మరి ఈ పరీక్షలను డాక్టర్ మేలు కోసం
రాశామా, పేషెంట్ కోసం రాశామా అనిపిస్తుంది.
* ఒక చీఫ్ ఇంజనీర్ బిపి పేషెంట్‌గా నా దగ్గరకు వచ్చాడు. ఆయనకు నిద్ర పట్ట
గానే.. ఒక రకంగా వేడి ఆవిరి పైకి వచ్చినట్లు, రక్తం తలలోకి ఫ్లో అయినట్లు అనిపించి
లేచేవాడు. ఆయనకు నిద్ర ఒక శాపమైపోయింది. బిపి మందులు వేసుకుంటున్నా
నిద్రాభంగం అవుతూనే ఉంది. ఈ లక్షణానికి పాము గరళంతో చేసిన
హోమియో మందు ఇచ్చాను. తర్వాత వారానికి ఆయనకు బిపి నార్మల్
స్థాయికి వచ్చింది. ఆయనకు మళ్లీ ఎప్పుడూ నిద్ర మధ్యలో లేవాల్సిన
అవసరం రాలేదు.
18వ శతాబ్దంలో మలేరియా తీవ్రంగా ఉండేది. దీనికి,
క్వైనా
ఔషధం
వాడేవారు. అది ఇస్తున్నారు, తగ్గుతోంది.
కానీ అది ఎలా పనిచేస్తోందో
విశ్లేషించలేకపోయారు. హోమియో వైద్యాన్ని కనుగొన్న శామ్యూల్
హానెమన్.. క్వైనా ఎలా పనిచేస్తోందో తెలుసుకోవాలని అనుకొన్నాడు.
క్వైనా కషాయాన్ని ఉదయం 4 డోసులు, సాయంత్రం 4 డోసులు తీసు
కున్నాడు. వారం రోజుల తర్వాత ఆయనకు చలిజ్వరం వచ్చింది. క్వైనా
చలి జ్వరానికి ఔషధం. కానీ దానివల్ల ఆయనకు చలి జ్వరం వచ్చింది.
తనమీదే ప్రయోగం చేసుకున్నాడు. అప్పటికి ఆపి, కొన్నాళ్ల తర్వాత
వేసుకొంటే మళ్లీ చలి జ్వరం వచ్చింది. దీని ఆధారంగా 1790లో 'వాట్
ఇట్ కెన్ కాజ్.. ఇట్ కెన్ క్యూర్ సూత్రాన్ని తెలిపాడు. ఈ విధంగా ప్రయోగాలు
చేయడం ద్వారా ఆయన జీవితకాలంలో వంద రెమిడీస్ కనుగొన్నాడు. 1812లో పొటె
న్సీ (డైల్యూటెడ్ సబ్ స్టెన్స్ యాక్ట్స్ యాజ్ ఎ మెడిసిన్)ని కనుగొన్నాడు. వంశపారంప
ర్యంగా వచ్చే లక్షణాలు కూడా వ్యాధికి దోహదం చేస్తాయని 1816-28 వరకు ఆయన
చేసిన ప్రయోగాల్లో తేలింది. దీనికోసం యాంటీమాయాజిమేటిక్ రెమిడీసను కూడా
కనుగొన్నాడు. ఇలా హోమియో వైద్యం మూడంచెలుగా అభివృద్ధి చెందింది.
* ఇవ్వాళ హోమియోపతి కాలేజీల్లో నూటికి తొంభై ఉండాల్సిన రీతిలో లేవని
ప్రభుత్వం గుర్తించి, ఈ సంవత్సరం నుంచి రికగ్నిషన్ ఆపేశారు.
• ప్రపంచంలో హోమియోలో ఇంజెక్షన్లు లేవు. ఎవరైనా చేస్తున్నా
మంటే అదంతా బోగస్. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్
దేశాల్లో నేను చూశాను. ఎక్కడా ఈ పద్ధతి లేదు.
జనాన్ని నమ్మిం
చడం కోసం కొందరు చేస్తున్నారేమో.
* అల్లోపతి డాక్టర్లు అనారోగ్యంలో దశలు పట్టించుకోవడం లేదు.
డాక్టర్, పేషెంట్ రిలేషన్ కమర్షియల్ గా మారింది. రోగి చెప్పేది
వినే ఓపిక వైద్యుడికి ఉండటం లేదు. అసలు దశను అర్థం చేసు
కుంటే హోమియోపతిలో డ్రగ్ సెలక్షన్ సులభం అవుతుంది.
* ప్రభుత్వం తెలంగాణలో అన్ని జిల్లా కేంద్ర అసుపత్రుల్లో
హోమియో వింగ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిసింది.
ఇదే జరిగితే హోమియో మరింత చేరువ అవుతుంది. నమ్మకం
పెరుగుతుంది.