నవ్వించడం అంటే నవ్వులాట ఏమీ కాదు యాగం ఎవరైనా చేయవచ్చు కానీ నలుగురిని నవ్వించాలంటే మాత్రం యోగం ఉండవలసింది అలాంటి యోగాన్ని పొంది హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండ్ అఫ్ కమెడియన్ శామా హరిణి వేసే ప్రతి పంచుపండిన ముల్లులా అది ఎవరిని గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత నలుగురు నడవని దారులు నడుస్తూ పదవుని పగలబడి నవ్వించే ఆమె ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే
హాస్యం ఎక్కడి నుంచో పుట్టదు మన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలోనే దానికి మూలాలు ఉంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు నాకు తారాసపడ్డ సందర్భాలని తీసుకుంటా వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా అందులో వాస్తవానికి దూరంగా మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందని హుందాగా ఉంటుందని అనడానికి కారణం ఇదేనేమో దాని వల్లే నేను షోలు చేసేటప్పుడు నలుగురు కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను మనం గమనిస్తే స్కూలు కాలేజీ ఆఫీసు ఫంక్షన్లు ఇలా ప్రతి చోటా జరిగే సంఘటనలు హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ రాసే వాళ్ళం గుర్తుందా నిజానికి అప్పటికే కంప్యూటర్లు వచ్చేశాయి అయినా కాపీ బుక్ లలో రోజు కలిసి రైటింగ్ రాయించేవారు ఒకవేళ రాయకపోతే వీళ్ళ మీద చేతి మీద కొ ట్టేవారు అసలు రాసేదే చేతితో దాని మీదే కొడితే మళ్ళీ ఎలా రాయగలమండి అసలు నాకీ విషయమే అర్థం కాదు అనగానే ఎవరైనా సరే పక్కన నవ్వేస్తారు ఇలాంటి క్లాస్ రూమ్ జోకులు నా కామెడీలో చాలా చూడవచ్చు
నాటకాల నుంచి ఇలా స్టాండప్ కామెడీ వైపు రావాలని నేను చిన్నప్పటినుంచి కంకణాలు తాయత్తులో అది ఏమీ కట్టుకోలేదు అలా జరిగిపోయింది అంతే అలా ఎలా జరిగిందో కూడా చెబుతాను మా నాన్న వాళ్ళ విజయవాడ అమ్మది బందరు నా చిన్నతనంలో ఎక్కువగా బందర్ కు వస్తూపోతూ ఉండేవాళ్ళం అయితే నాన్న వ్యాపార రీత్యా మేము చెన్నైలో స్థిరపడ్డాం. నా చదువు కూడా ఇక్కడే కొనసాగింది నేను ఎమ్మె చేశాను డిగ్రీలో ఉండగానే పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసేదానిని అలా ఏవం అనే ఓ డ్రామా స్టాండ్ ప్రోగ్రాంలో కంపెనీలో ఆర్గనైజర్ గా చేరాను నాకు చిన్నప్పటినుంచి నాటకాలు అంటే ఇష్టము స్కూలు కాలేజీల్లో డ్రామాలు వేసే వాళ్ళం స్టేజీల మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడం అన్నది ఓ సరదా దీనితో ఈ సంస్థలో పనిచేసే అప్పుడే స్టాండప్ కమెడి ప్రయత్నించాలన్న ఆలోచన వచ్చింది. స్క్రిప్ట్ తయారు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించాను అలా నేను ఏమి మొదటి సంవత్సరంలో ఉండగా 2018లో నా తొలి స్టాండప్ కామెడీ షో చేశాను ప్రశంసలు బాగానే వచ్చాయి
అదే ఆనందం నా షో చూసి చాలా బాగుంది మీరు బాగా చెప్తారు అనడం చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే కళాకారులకు ప్రశంసకు మించిన పురస్కారం మరొకటి ఉండదు నాకు కారం లాంటి ఇష్టం అందుకే వాటికి సంబంధించిన డ్రెస్ లు ఎక్కువగా వేసుకుంటాను కార్పొరేట్ ఆఫీసులు ప్రైవేట్ ఈవెంట్లు ఇలా అన్నీ కలిపి ఇప్పటికీ 60 దాకా షోలు చేసి ఉంటాను తెలుగు తమిళం ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ కార్యక్రమాలు చేస్తాను తెలుగులో యూట్యూబ్ కామెడీ షో ఖుషి ఖుషీగాలు విన్నర్ అయ్యాను అలాగే amazon prime వాళ్ళ కార్యక్రమం కోసం స్టాండ్ ఆఫ్ కమెడియన్లు అందరం రెండు నెలలు ఒకే హోటల్లో ఉండి ప్రదర్శనలు ఇవ్వడం ఒక మంచి అనుభూతి ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలు వేరమారి ఆఫీస్ అనే సిరీస్ తో పాటు తమిళ్లోనే మరో వెబ్ సిరీస్ నటించాను అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది నాకు దర్శకుడు జంధ్యాల గారి హాస్యం అంటే ఇష్టం ఫేవరెట్ కమెడియన్లు చాలామంది ఉన్నా బాగా నచ్చే కమెడియన్ అంటే శ్రీ లక్ష్మీ గారు అని చెబుతాను ఇక శ్యామా తగ్గామా పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ఇటీవలే ప్రారంభించాను ఒక మహిళగా ఆడవాళ్ళ సమస్యలను వాళ్లకు సంబంధించిన విషయాలను సున్నితంగా హాస్య రూపంలో నలుగురితో పంచుకుంటుంటాను ఈ రంగంలో మహిళా కమెడియన్లు తక్కువ మరింత మంది స్టాండ్ అప్ కమెడియన్లుగా వస్తే ఆడవాళ్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి అది తప్పకుండా స్త్రీలపై ఎదుటి వాళ్ళ దృష్టికి కూడా మారడానికి సహాయపడుతుంది అందుకే నాలాగే ఇంకొందరు ఆడపిల్లలు ఈ వృత్తి లోకి రావాలని ఆశిస్తాను అన్నారు శామాహారిణి