Wednesday 27 March 2024

శ్యామ హంగామా.. శ్యామా ద గామా

 నవ్వించడం అంటే నవ్వులాట ఏమీ కాదు యాగం ఎవరైనా చేయవచ్చు కానీ నలుగురిని నవ్వించాలంటే మాత్రం యోగం ఉండవలసింది అలాంటి యోగాన్ని పొంది హాస్య యాగాన్ని చేస్తున్నారు ప్రముఖ స్టాండ్ అఫ్ కమెడియన్ శామా హరిణి వేసే ప్రతి పంచుపండిన ముల్లులా అది ఎవరిని గుచ్చకపోవడం ఆమె ప్రత్యేకత నలుగురు నడవని దారులు నడుస్తూ పదవుని పగలబడి నవ్వించే ఆమె ఈ విభిన్నమైన వృత్తిలోకి ఎలా వచ్చారు అందులో తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అంటే

హాస్యం ఎక్కడి నుంచో పుట్టదు మన రోజువారి జీవితంలో జరిగే సంఘటనలోనే దానికి మూలాలు ఉంటాయి. నేనైతే ప్రోగ్రాములకు స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు నాకు తారాసపడ్డ సందర్భాలని తీసుకుంటా వాటినే కాస్త నవ్వు పుట్టించేలా చెబుతా అందులో వాస్తవానికి దూరంగా మనం మాట్లాడుకోలేని విధంగా ఉండే జోకులకు ఆస్కారం ఉండదు కదా బహుశా అందరూ నా హాస్యాన్ని సున్నితంగా ఉందని హుందాగా ఉంటుందని అనడానికి కారణం ఇదేనేమో దాని వల్లే నేను షోలు చేసేటప్పుడు నలుగురు కనెక్ట్ అవుతున్నారని అనుకుంటాను మనం గమనిస్తే స్కూలు కాలేజీ ఆఫీసు ఫంక్షన్లు ఇలా ప్రతి చోటా జరిగే సంఘటనలు హాస్యం తొంగి చూస్తూ ఉంటుంది మీకు ఒక ఉదాహరణ చెబుతాను మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ కర్సివ్ రైటింగ్ రాసే వాళ్ళం గుర్తుందా నిజానికి అప్పటికే కంప్యూటర్లు వచ్చేశాయి అయినా కాపీ బుక్ లలో రోజు కలిసి రైటింగ్ రాయించేవారు ఒకవేళ రాయకపోతే వీళ్ళ మీద చేతి మీద కొ ట్టేవారు అసలు రాసేదే చేతితో దాని మీదే కొడితే మళ్ళీ ఎలా రాయగలమండి అసలు నాకీ విషయమే అర్థం కాదు అనగానే ఎవరైనా సరే పక్కన నవ్వేస్తారు ఇలాంటి క్లాస్ రూమ్ జోకులు నా కామెడీలో చాలా చూడవచ్చు

నాటకాల నుంచి ఇలా స్టాండప్ కామెడీ వైపు రావాలని నేను చిన్నప్పటినుంచి కంకణాలు తాయత్తులో అది ఏమీ కట్టుకోలేదు అలా జరిగిపోయింది అంతే అలా ఎలా జరిగిందో కూడా చెబుతాను మా నాన్న వాళ్ళ విజయవాడ అమ్మది బందరు నా చిన్నతనంలో ఎక్కువగా బందర్ కు వస్తూపోతూ ఉండేవాళ్ళం అయితే నాన్న వ్యాపార రీత్యా మేము చెన్నైలో స్థిరపడ్డాం. నా చదువు కూడా ఇక్కడే కొనసాగింది నేను ఎమ్మె చేశాను డిగ్రీలో ఉండగానే పాకెట్ మనీ కోసం పార్ట్ టైం జాబ్ చేసేదానిని అలా ఏవం అనే ఓ డ్రామా స్టాండ్ ప్రోగ్రాంలో కంపెనీలో ఆర్గనైజర్ గా చేరాను నాకు చిన్నప్పటినుంచి నాటకాలు అంటే ఇష్టము స్కూలు కాలేజీల్లో డ్రామాలు వేసే వాళ్ళం స్టేజీల మీద పెర్ఫార్మన్స్ ఇవ్వడం అన్నది ఓ సరదా దీనితో ఈ సంస్థలో పనిచేసే అప్పుడే స్టాండప్ కమెడి ప్రయత్నించాలన్న ఆలోచన వచ్చింది. స్క్రిప్ట్ తయారు చేసుకుని ప్రాక్టీస్ ప్రారంభించాను అలా నేను ఏమి మొదటి సంవత్సరంలో ఉండగా 2018లో నా తొలి స్టాండప్ కామెడీ షో చేశాను ప్రశంసలు బాగానే వచ్చాయి

అదే ఆనందం నా షో చూసి చాలా బాగుంది మీరు బాగా చెప్తారు అనడం చాలా సంతోషంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే కళాకారులకు ప్రశంసకు మించిన పురస్కారం మరొకటి ఉండదు నాకు కారం లాంటి ఇష్టం అందుకే వాటికి సంబంధించిన డ్రెస్ లు ఎక్కువగా వేసుకుంటాను కార్పొరేట్ ఆఫీసులు ప్రైవేట్ ఈవెంట్లు ఇలా అన్నీ కలిపి ఇప్పటికీ 60 దాకా షోలు చేసి ఉంటాను తెలుగు తమిళం ఇంగ్లీష్ మూడు భాషల్లోనూ కార్యక్రమాలు చేస్తాను తెలుగులో యూట్యూబ్ కామెడీ షో ఖుషి ఖుషీగాలు విన్నర్ అయ్యాను అలాగే amazon prime వాళ్ళ కార్యక్రమం కోసం స్టాండ్ ఆఫ్ కమెడియన్లు అందరం రెండు నెలలు ఒకే హోటల్లో ఉండి ప్రదర్శనలు ఇవ్వడం ఒక మంచి అనుభూతి ఓటిటి ప్లాట్ఫామ్ ఆహాలు వేరమారి ఆఫీస్ అనే సిరీస్ తో పాటు తమిళ్లోనే మరో వెబ్ సిరీస్ నటించాను అది త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నది నాకు దర్శకుడు జంధ్యాల గారి హాస్యం అంటే ఇష్టం ఫేవరెట్ కమెడియన్లు చాలామంది ఉన్నా బాగా నచ్చే కమెడియన్ అంటే శ్రీ లక్ష్మీ గారు అని చెబుతాను ఇక శ్యామా తగ్గామా పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ ఇటీవలే ప్రారంభించాను ఒక మహిళగా ఆడవాళ్ళ సమస్యలను వాళ్లకు సంబంధించిన విషయాలను సున్నితంగా హాస్య రూపంలో నలుగురితో పంచుకుంటుంటాను ఈ రంగంలో మహిళా కమెడియన్లు తక్కువ మరింత మంది స్టాండ్ అప్ కమెడియన్లుగా వస్తే ఆడవాళ్లకు సంబంధించిన మరిన్ని విషయాలు ప్రస్తావనకు వస్తాయి అది తప్పకుండా స్త్రీలపై ఎదుటి వాళ్ళ దృష్టికి కూడా మారడానికి సహాయపడుతుంది అందుకే నాలాగే ఇంకొందరు ఆడపిల్లలు ఈ వృత్తి లోకి రావాలని ఆశిస్తాను అన్నారు శామాహారిణి

సాగర్ కన్వర్ రాజస్థాన్

 నువ్వేం చేయగలవు ఆడవాళ్లకు ఇవి అవసరమా ఇలాంటి మాటలు వినగానే నిరుత్సాహం ఆవరించి చేస్తుంది కానీ సాగర్ కన్వర్ 16 ఏళ్లకే పెళ్లి చేసిన సంప్రదాయాలు సామాజిక కట్టుబాట్లంటూ అడ్డుపడిన వాటన్నింటినీ దాటి ముందుకు వచ్చింది సేంద్రియ సాగుతూ వందల మంది మహిళల జీవితాల్లో మార్పు తెచ్చింది రాజస్థాన్లోని శిరోహి జిల్లాలోని వీరు వాడ అనేకు గ్రామం 16 ఏళ్లకే పెళ్లి చేసే అత్తారింటికి పంపించారు పుట్టింటి వాళ్ళు ఆ తర్వాత పిల్లల ఆలనా పాలన పొలం పాడిపన్నుల్లో భర్తకు సహాయం ఇలా ఒకదాని తర్వాత మరొక పని చేస్తూనే రోజులు గడిపేయడం తనకి నచ్చలేదు ఇంకా ఏదైనా చేస్తే బాగుంటుందని భావించింది ఆలోచించగా గ్రామస్తులకు ప్రధాన ఆదాయ వనరు అయిన పాల ఉత్పత్తిని పెంచేందుకు ఒక సొసైటీని ప్రారంభించాలనుకుంటే ఇంట్లో మొదట ఒప్పుకోకపోయినా తర్వాత సరైన అనడంతో తోటి వారిని కలుపుకొని ఆశ మహిళ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో సొసైటీ ప్రారంభించింది 

గ్రామస్తులకు ఇది బాగా ఉపయోగపడి పాల ఉత్పత్తి పెంచారు 2016లో టాటా ట్రస్ట్ డైరీ మిషన్తో పాటు జిల్లాలోని మరికొన్ని సంస్థలు వీరికి సాంకేతిక సహాయం అందించాయి సాగర్ సాధించిన ఈ తొలి విజయంతో సొసైటీ విస్తరించింది పరుగు గ్రామాల ప్రజలు ఇందులో సభ్యులుగా చేరారు మరోవైపు వ్యర్ధాలతో సేంద్రీయ ఎరువుల తయారీపై దృష్టి పెట్టింది అలా వచ్చిన ఉత్పత్తిని స్థానిక రైతులకు తక్కువకే విక్రయించడంతోపాటు తాను సేంద్రియ సాగు చేసి రైతుల్లో స్ఫూర్తిని రగిలించింది ఇవన్నీ అక్కడి వారి ఆదాయాలు గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయి ఈ కృషికి గుర్తింపు గానీ ఈ ఏడాది జనవరిలో భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఎక్సలెన్స్ అవార్డుని అందించింద

ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్ అవార్డును కూడా అందుకుంది ఇప్పుడు 400 మంది మహిళలతో స్వయం సహాయక సంఘాన్ని నడిపిస్తోంది సాగర్కి ఇద్దరు పిల్లలు అబ్బాయి ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం నుంచి పట్టానందుకోగా అమ్మాయి బెంగళూరులో గ్రాడ్యుయేషన్ చేస్తుంది అసలు కుటుంబాన్ని పట్టించుకుంటున్నావా అంటూ చాలామంది విమర్శించారు ఇంకా బయట సమన్వయం కష్టమే గెలుపు కోసం ఓపిగ్గా ఎదురు చూడాలి అంతేకానీ కలని వదులుకుంటామా అంటోంది సాగర్ కణ్వర్.



Monday 25 March 2024

గులాల్ గోట రంగుల కళ

 హోలీ అంటే మనకు రంగులే మనసులో మెదులుతాయి వాటితో పాటు సింథటిక్ వరణాలు చేసే హాని గుర్తుకొస్తుంది కానీ 400 ఏళ్ల నుంచి సహజ రంగులతో చేసే గులాల్ గోట రంగుల గురించి వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ కళ నీ బతికించిన  గుల్ రుక్ సుల్తానా కథ ఆసక్తికరమే

గులాల్ కోట ఇది సహజరంగుల నింపిన బంతులు చూడడానికే దృఢంగా ఉంటాయి కానీ తాకి తాకగానే పగిలి రంగులు వెదజల్లుతాయి వీటిని లక్కతో చేస్తారు ప్రత్యేకమైన నైపుణ్యం ఉంటే తప్ప ఈ బంతులు చేయలేరు ఇందులోని రంగులు మనకు ఏమాత్రం హాని చెయ్యవు అందుకే వాటికి అంత డిమాండ్ ఈ కళ 400ఏల క్రితం జైపూర్లో పుట్టింది రాజ కుటుంబాలు హోలీ ఆడుకోవడానికి కొన్ని ముస్లిం కుటుంబాలు ఈ గులాల్ గోటాలని తయారు చేసేవి అప్పట్లో హోలీ వస్తే ఈ కుటుంబాలకు క్షణం తీరిక దొరికేది కాదట కాలక్రమమైన సింథటిక్ రంగుల తాకిడి వల్ల వీటికి ఆదరణ తగ్గింది అయినా కొన్ని కుటుంబాలు మాత్రం ఈ కళని అంటిపెట్టుకొని ఉన్నాయి అందులో ఆవాజ్ మహమ్మద్ కుటుంబం ఒకటి ఆయన కూతురే గుర్ కుటుంబాన్ని పోషించడం కోసం చదువుకుని చదువుకు కూడా దూరమై గులాల్ గోటాలు తయారు చేసేది తనకి మరికొందరు తోడయ్యారు వీరంతా కలిసి చేసిన వీటిని జైపూర్ లోని గోవింద్ జి మధుర ఆలయాలతో పాటు బృందావనకు వెళ్తుంటాయి ఈ కళ తనతోనే అంతరించిపోకూడదని జైపూర్ ముంబై సూరత్లతోపాటు దుబాయ్ కి వెళ్లి ఎంతో మందికి శిక్షణ ఇచ్చారు ఈమె జేజేస్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ పెరల్ అకాడమీ ఆయోజాన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ వంటి చోట్ల గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసే ఎంతోమందికి ఈ కళా గొప్పదనం గురించి చెబుతున్నారు ఆమె కృషికి 2013లో యునెస్కో అవార్డు వరించింది



Friday 15 March 2024

నిధిస్ గ్రాండ్ మా సీక్రెట్

 పెద్దల మాట పెరుగన్న మూట అని ఊరికే అనలేదు పెద్దల మాట నెలకు లక్షలాది రూపాయల ఆదాయాన్ని అర్జించే పెద్ద వ్యాపార సూత్రం గా మారిపోయింది

ముంబై కి చెందిన రజని నిధి గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో సరదాగా ప్రారంభించిన హోం మేడ్ హెయిర్ ఆయిల్ బిజినెస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగంలో వచ్చే జీతం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ఆదాయాన్ని చేకూర్తుంది దీనిని బట్టి ఏదైనా పాతకాలంనాటి కబుర్లు చెప్పిన పాత పద్ధతులు పాటించిన అంతా పాత చింతకాయ పచ్చడిలే అని తేలిగ్గా తీసేసేవారు ఇకపై ఆచితూచి మాట్లాడాలేమో ఎందుకంటే అప్పటి పాత ఫారం లోనే కదా ఇప్పుడు సక్సెస్ సూత్రంగా మారిపోయింది నిధి రొటేజాకి ఆదివారం సెలవును అమ్మమ్మ ఇంటిలో సరదాగా గడపడం అలవాటు నిధి అమ్మమ్మ రకరకాల ఔషధ మూలికలను మేళ నుంచి ఒక విధమైన తలను నేను తయారు చేసేది అలా ఆమె సొంతంగా తయారు చేసిన ఆయిల్ తో నిధి తలకు మర్దన చేసి కాసేపటి తర్వాత తలస్నానం చేయించేది అమ్మమ్మ చేతిలోనే మహత్యం వల్ల నిదికి తోటి విద్యార్థులు అందరూ కోళ్లుకునేంత నల్లటి ఉత్తమ కేశ నిధి ఉండేది.

చదువు తర్వాత అమ్మమ్మ ఊరికి వెళ్లడం బాగా తగ్గిపోయింది ఇంతలో దేశాన్ని అంతటినీ కుదిపేస్తున్న కోవిడ్ మహామారి గురుగ్రామం కూడా వదలలేదు అక్కడే ఉన్న నిధిని కూడా అసలు వదలలేదు ఫలితంగా నీది జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడడం మొదలు పెట్టింది క్రమంగా ఆమెను ఇతరులు ఎవరూ పోల్చుకోలేనట్లు తయారైంది అది చూసిన నిధి తల్లికి చాలా బాధ వేసింది

తన అమ్మ నుంచి ఆ నూనె తయారీ ఫార్ములా అని తెలుసుకొని తన అత్తగారు ఈ విషయంలో ఏమైనా సహాయం చేయగలరా అని అడిగింది కోడలు చెప్పిన ఫార్ములాను ప్రయత్నించింది అత్తగారైన రజని ఎట్టకేలకు తయారైన ఆ ఆయిల్ ను నిధి తలకు రాసి మర్దన చేయడం మొదలుపెట్టారు ఆ అత్త కోడలు ఆశ్చర్యం కొద్ది రోజుల్లోనే ఆ నూనె మంచి ఫలితాలను ఇచ్చింది పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడం మొదలైంది ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోని ఇతర ఫ్లాట్ల వాళ్ళు అది గమనించి ఎలా సాధ్యమైంది ఇదంతా అని అడిగి విషయాన్ని తెలుసుకున్నారు తమకు కూడా అలాంటి ఆయిల్ తయారు చేసే ఇమ్మని అడగడమే కాదు అడ్వాన్సుగా కొంత మొత్తాన్ని చేతిలో పెట్టడం మొదలుపెట్టారు ఇదేదో బాగుంది అనిపించింది నిధికి దాంతో తన నానమ్మ రజిని సహాయంతో అమ్మ సహకారంతో ఆయిల్ తయారీ ఆరంభించింది వీరి ఆయిల్ గురించి ఆ నోట ఈ నోట కాదు కొన్ని డజన్ల వాట్సాప్ గ్రూప్ లలో పడి మొదట్లో కొద్ది లీటర్లకే పరిమితమైన ఆయిల్ తయారీ పెద్ద ఎత్తున తయారు చేయాలన్న నిర్ణయం తీసుకునేలా చేసింది

దాంతో గత సంవత్సరం మార్చిలో నిధి రజినీ దువా కలిసి నితీష్ గ్రాండ్ మా సీక్రెట్ పేరుతో ఒకసారి కొత్త ఆయిల్ బ్రాండ్ ఉత్పత్తిని ప్రారంభించారు ఫలితంగా అందరి చుట్టూ పెరగడం మాట ఎలా ఉన్నా వీరి ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది ఇప్పుడు నీది రజిని తయారు చేస్తున్న ఈ ఆయిల్ 67 వేల ఇళ్లకు చేరింది నెలకు లక్ష బాటిల్ల తయారీతో నెలకు సుమారు 50 లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జించిపెడుతోంది అమ్మమ్మ ఫార్ములా ప్రకారం ఇప్పుడు నిధి ఆమెతోపాటు ఆమె నానమ్మ గారు స్వచ్ఛమైన కొబ్బరినూనెలో 13 రకాల వనమూలికల కలగలుపుతో పెద్ద ఇనుప మూకుడులో కొన్ని గంటల పాటు మరగబెడుతూ కలుపుతూ తయారు చేసిన ఈ హోం మేడ్ ఆయిల్ ఇప్పుడు పెద్దపెద్ద యంత్రాలతో లక్షల బాటిల్ల తయారీ లక్ష్యాన్ని చేరుకుంది పాతకాలంనాటి ఫార్ములాను తేలికగా చూసేవాళ్ళు ఇకనైనా ఇలాంటి విద్యను అందిపుచ్చుకుంటే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు  నిలబడడం సాధ్యమవుతుంది