16, అక్టోబర్ 2026, శుక్రవారం

నాలుగు మంచి మాటలు 16-10-2026

1 . ) మాట్లాడండి..

మీ మౌనం మిమ్మల్ని కాపాడదు. కానీ మీ గొంతు ఈ ప్రపంచాన్ని మీకు అనుకూలంగా మార్చగలదు .మీరు ఉన్న క్లిష్టమైన పరిస్థితి నుంచి మిమ్మల్ని గట్టెక్కించగలదు .జనం ఏమనుకుంటారో నన్న భయం విడిచిపెట్టండి. మీ మనసులో ఉన్నది బయట పెట్టేయండి..

తను శ్రీ దత్తా..నటి,మోడల్.

2 .)  నిరాశ అనే రుచి లేదు..

ప్రకృతి నిండా రుచులున్నాయి. నిరాశ అనే రుచి ఎక్కడా లేదు.ప్రకృతిలో లేని నిరాశ ,జీవితంలో మాత్రం ఎందుకుండాలి? ఆశల చిగురింతే జీవితం..

.. హిందూ ధర్మం.

3 . )  మీరు జీవితంలో గెలవాలంటే..

రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమిస్తే, ఉదయం తొందరగా మేల్కోవడం కష్టమేమీ అనిపించదు. ఇంట్లోకి జంక్ ఫుడ్ తెచ్చుకోకుంటే ..ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం దానంతట అదే అలవాటుగా అవుతుంది. అనవసర ఖర్చులను తగ్గించుకుంటే ,పెట్టుబడుల కోసం డబ్బు మిగిలిపోతుంది.

 జీవితంలో గెలవాలంటే మీరు గొప్ప మేధావి అయ్యుండాల్సిన అవసరం లేదు. రోజువారి నిర్ణయాలను మెరుగ్గా తీసుకుంటే చాలు..

కెవిన్ షాబో.. కాపీ రైటర్..

4 . )  ఆరోగ్యకరమైన మార్పులు సమాజానికి వింతగా కనిపించవచ్చు..

 మనలో వచ్చే మంచి మార్పులను సమాజం కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మనం బరువు పెరుగుతున్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ మంచి ఆహారం తింటూ వ్యాయామం చేసి బరువు తగ్గితే మాత్రం" ఏమైనా అనారోగ్యమా " అని అడుగుతారు.

 అనారోగ్యకర అలవాట్లకు అలవాటు పడిన సమాజానికి నిజమైన ఆరోగ్యం వైపు అడుగులు వేయడం అనేది కూడా కొన్నిసార్లు వింతగానే అనిపిస్తుంది. 

సోమేష్ పాల్.. ఫిట్ నెస్ కోచ్..

5 . ) ఆత్మ న్యూనత వద్దు..

నిన్ను నీవు తక్కువ చేసుకోకు. ప్రయత్నం చేసి ఓడిపో కానీ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు .జీవితంలో వైఫల్యాలు భారం అని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలను నేర్చుకోవచ్చు. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది. 

- విశ్వ కవి రవీంద్ర నాథ్ ఠాగూర్..

6 . )  వైఫల్యాలే అత్యుత్తమ పాఠాలను నేర్పుతాయి..

జీవితంలో విజయం సాధించడానికి కావాల్సింది డిగ్రీలు, డబ్బు కాదు. పట్టుదల, నేర్చు కోవాలనే బలమైన కోరిక. వైఫల్యాలు, తప్పులు, ఇబ్బందులే మనిషికి అత్యుత్తమ పాఠం నేర్పుతాయి. నిజమైన సృజనాత్మకత, పరిపూర్ణత మొదలైనవి ఇలాంటి అనుభవాల నుంచే పుట్టుకొస్తాయి.

 రాబర్ట్ గ్రీన్ రచయిత .

7 . ) చిన్న చిన్న విషయాలే..

చాలా తప్పులు,పొరపాట్లు,ప్రమాదాలు ఎందుకు జరిగిపోతుంటాయంటే ,మనం అన్నీ చూస్తాం కానీ దేన్నీ పరిశీలించం. చిన్న చిన్న విషయాలే అత్యంత ముఖ్యమైనవి నేను నమ్ముతాను.

సర్ ఆర్థర్ కానన్ డాయ్ ల్..ప్రసిద్ధ ఆంగ్ల రచయిత.

8 . ) మీ లిమిట్స్ నిజమైనవి కావు..

వెనక్కు లాగుతున్న ఏదైనా ఒక అంశాన్ని తీసుకోండి. ఉదాహరణకు నా వయసు అయిపోయింది .అనో లేక నా దగ్గర డబ్బు లేదు అనో మీరు అనుకోవచ్చు. మీలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులు ఎంతోమంది ఆటంకాలను దాటుకొని ముందుకు వెళ్తారు. అంటే దానర్థం మీ పరిమితులు నిజమైనవి కావు. అవి మీ ఆలోచనలు మాత్రమే.. 

డెరెక్ సివర్స్..రచయిత..

9 . ) మూడు ప్రశ్నలు..

మిమ్మల్ని మీరు కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేసుకోండి. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను ..నాకు స్ఫూర్తిని ఇచ్చేది ఏమిటి? ఈ సమాజానికి నేనెలా తిరిగి ఇవ్వగలను.. ఈ ప్రశ్నలు వేసుకున్న తర్వాత మీ మార్గాన్ని మీరే నిర్దేశించుకోండి .ఎవరిని సలహాలు అడగకండి..

డివి సదానంద గౌడ.. కేంద్ర మాజీ మంత్రి.

10 . ) మీ బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ ఉందా..

మీ రోజును అధిక ప్రోటీన్ ఉండే అల్పాహారం తో ప్రారంభిస్తే ..రోజంతా ఆకలిని నియంత్రించుకోవడం సులువవుతుంది.ప్రోటీన్ కడుపు నిండిన భావనను ఎక్కువ సేపు ఉంచడంలో సహాయ పడుతుంది..

వివేక్ గుప్తా.. ఫ్యాట్ లాస్ కోచ్..

11 . ) బలమైన వ్యక్తిత్వం..

బలహీనులే తమ స్థితి గతులకు బాధ్యత వహించరు.పరిస్థితుల మీదనో,ఇతరుల మీదనో నింద వేస్తారు.బలమైన వ్యక్తిత్వం ఉన్న వారు తాము నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటారు.. ఆ క్రమంలో ఎలాంటి కష్ట నష్టాలనైనా ఎదుర్కొంటారు..

అమీష్ త్రిపాఠి,రచయిత..

12 . ) నిజాయితీ..

నేనెప్పుడూ గొప్ప సినిమాలు తీయాలనుకోలేదు.నిజాయితీ గల సినిమాలు తీయాలనుకున్నాను.మీకు తెలిసిన పాత్రలకు మీరు కట్టుబడి ఉంటే ,చివరికి ప్రపంచమే వచ్చి మీ సినిమా కోసం థియేటర్ లో చోటు సంపాదించుకుంటుంది.

13 .) జీవితం ప్రదర్శన కోసం కాదు..

మీ జీవితంలో చేసే పనులు కేవలం ప్రదర్శన కోసమే చేస్తున్నారా..లేదా మీ సొంత సంతృప్తి కోసం చేస్తున్నారా..అనేది ఒక సారి లోతుగా ఆలోచించుకోండి. ఇతరుల కోసం చేసే పనులు మిమ్మల్ని శూన్యంలోకి నెడితే .. మీ కోసం మీరు చేసే పనులు మీ జీవితానికి సరికొత్త శక్తినిస్తాయి.

జూలీ గుర్నార్,పెర్ఫార్మెన్స్ కోచ్.

14 . ) రెండో స్థానం..

రజతం గెలవటానికి ఉదయాన్నే ఎవరూ ఉత్సాహంగా నిద్ర లేవరు. స్వర్ణం కోసం ప్రయత్నించండి.సంకల్పం,ఆచరణ ఏకమైనప్పుడు మాత్రమే విజయం మీ చే చిక్కుతుంది.రెండో స్థానానికి సంసిద్ధం అవడం అంటే నిరాశతో చేయి కలపటమే..

బిల్ మెక్ డెర్మాట్, సర్వీస్ నౌ చైర్మన్.

15 . ) ఎలాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నారు..

మీరు దేనినైతే పదే పదే పునరావృతం చేస్తారో , మీ మెదడు ఆ విషయంలో మరింత నైపుణ్యం సాధిస్తుంది. ఒక వేళ మీరు రోజూ గంటల తరబడి చెడు పరిణామాల గురించే ఆలోచిస్తూ ఆందోళన చెందితే .. మీ మనసు ఆందోళన చెందడానికి సాకులను వెతకడంలో నిపుణుడిగా మారిపోతుంది..

రాజ్ శమానీ .. పాడ్ కాస్టర్..

16 . ) టై,సూట్..

డబ్బు సంపాదించటానికి మీకు టై, సూట్ అవసరం లేదు.జ్ఞానం,వివేకం ఉంటే చాలు.మార్కెట్ లో మొదట సరస్వతి/ జ్ఞానం పై దృష్టి పెట్టండి.తద్వారా లక్ష్మీ/సంపద కటాక్షం కలుగుతుంది.సంపద సృష్టికి ఆర్థిక అజ్ఞానమే పెద్ద అడ్డంకి..

నీలేష్ షా, కోటక్ అసెట్ మేనేజ్ మెంట్ ఎండి..

17 . ) కళలు ఎందుకున్నాయంటే..

ఒక కూని రాగమైనా తీయకుండా ,ఒక్కసారైనా భళ్ళున నవ్వకుండా రోజు గడిచిందంటే అది జీవించిన రోజు కాదు,కోల్పోయిన సమయం.

జీవన వాస్తవాల నుంచి రక్షించడానికే మనకు కళలు ఉన్నాయి..

..ఫ్రెడరిక్ నీషే 

18 . ) మారాలి..

ఏఐ యుగంలో ఇక పాత స్టార్టప్ వ్యూహాలు పనిచేయవు. మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏఐలో అంత పురోగతి కనిపిస్తున్నప్పుడు ,అప్పటికప్పుడు అటువైపుగా మల్లటానికి మీతో సహా అన్నిటిలోనూ మార్పులు చేసుకోవాలి..

హార్జోత్ గిల్, కోడ్ రాబిట్ సీఈఓ 


12, అక్టోబర్ 2026, సోమవారం

నాలుగు మంచి మాటలు 12-10-2026

1 .)  విత్తనాలు..

మీ మనసు ఒక తోట లాంటిది. మీరు శాంతి, ఆనందం, కృతజ్ఞత అనే విత్తనాలను నాటక పోతే చింత, ఆందోళన అనే కలుపు మొక్కలు సహజంగానే పెరుగుతాయి. మన మానస్థిక స్థితిని మనమే మలుచుకోవాలి. సానుకూల ఆలోచన లను నాటుకోవాలి... హంసాజీ యోగేంద్ర, యోగ గురువు

2 . ) మనసుకు ఎలాంటి సమాచారం ఇవ్వాలంటే.. 

మీ మనసుకు మీరు అందిస్తున్న సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.మీరు రోజూ కేవలం ఆర్థిక కష్టాలు,పెరుగుతున్న ధరలు, వ్యాపార నష్టాలు,డబ్బు సంపాదనలో ఉండే అడ్డంకుల గురించి తెలిపే సమాచారాన్నే చూస్తుంటే..భవిష్యత్తులో ఇక కష్టపడినా ఎలాంటి అర్థం లేదు అని మీరే నమ్మడం ప్రారంభిస్తారు.

- ఓ. పీ. జిరి,ఫైనాన్షియల్ మెంటార్..


3 . ) ఉచిత పథకాలతో..

కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మహిళల జీవితాలు మారిపోవు.వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు, సొంత సంపాదనకు దారులు చూపించినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

- జయతీ ఘోష్, ఆర్థిక వేత్త.

4 . ) ఆరోగ్యకర జీర్ణ వ్యవస్థ తోనే..

పేగుల గోడ కేవలం ఒకే పొర కణాలతో నిర్మాణమై ఉంటుంది. జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం తిన్నప్పుడు ఆ రక్షణ పొర దెబ్బ తింటుంది.దాంతో హానికర క్రిములు రక్తంలోకి చేరతాయి.ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను పెంచి ఇన్సులిన్ పని చేసే విధానం దెబ్బ తీస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే జీవక్రియను మెరుగు పరుచుకోవచ్చు.

- సుమిత్ శర్మ,డాక్టర్.

5 . ) ప్రతి నిర్ణయానికి వివరణ అవసరం లేదు..

మీరు ఎదుటివారి జీవితం నుంచి ఎందుకు వెళ్ళిపోయారో వివరించాల్సిన అవసరం ఉందని ఒక దశ తర్వాత మీకు అనిపించదు.ఎందుకంటే మీతో కలిసి ఆ పరిస్థితిని అనుభవించిన వారికి అసలు నిజం ఏంటో తెలిసే ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోని వారికి వేయి మాటలు చెప్పినా వారిలో మార్పు రాదు. మీ ప్రతి నిర్ణయానికి అందరి మద్దతు అవసరం లేదనే నిజం గ్రహించినప్పుడే అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది.

- డేవ్,కంటెంట్ క్రియేటర్.

6 . ) డబ్బు ఆదా కు సులభ మార్గాలు..

పెళ్ళికి ముందే మీ కెరీర్,సంపాదనను సెట్ చేసుకోవడం,డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ వాడడం,భారీ అద్దె ఖర్చులను తగ్గించుకోవడం,విలాసాల కోసం అప్పులు చేయకపోవడం..లాంటివి డబ్బును ఆదా చేయడం లో సహాయ పడతాయి.

- మార్క్ టిల్బరీ, ఆంత్ర ప్రేన్యూర్ 

7 . ) శిక్షణ అనేది. 

ప్రయత్నం లేకుండానే తన లక్ష్యాన్ని సాధించగలనని భావించడం ,శిక్షణ లేని మనసు లక్షణం. కేవలం ఆశించడం వల్ల ఏమీ సాధించలేము... అలైస్టర్జ్ క్రౌలీ.. 

8 . ) టీమ్ వర్క్..

ఒక బృందంగా ఏదైనా సాధించడంలో ఉండే ఆనందం, వ్యక్తిగత విజయాని కన్నా చాలా గొప్పది .ఒక్కరి ప్రతిభ మిమ్మల్ని కొంత దూరం మాత్రమే తీసుకు వెళ్ళగలదు . వ్యాపారము మొదలు ఏ ఇతర రంగంలో నైనా సంపూర్ణ విజయానికి జట్టు కృషి యే కీలకం.. కుమార మంగళం బిర్లా,ఆదిత్య గ్రూప్ చైర్మన్.. 


1, మే 2026, శుక్రవారం

పెన్ ఆంటీ.. రతన్ బామ్మ@పుణె

 


నడక తడబడుతున్న చేతులు వణుకుతున్న ఎండ వానలను లెక్క చేయకుండా కొందరు వృద్ధులు పనులు చేస్తుంటారు. పేదరికం వల్ల, తప్పనిసరై ,బిడ్డలకు భారం కాకుండా, తాము ఒక చేయి వేయాలని కష్టం చేయడానికి  వాళ్లు రోడ్డు ఎక్కుతారు. ఏవైనా వస్తువులు అమ్మడం, హస్తకళా రూపాలు తయారు చేయడం, పాటతోను, వాద్యంతోను, అలరించడం చేస్తూ ఉంటారు. ప్రతిఫలంగానే తప్ప ఉచితంగా డబ్బు తీసుకోరు. సిగ్నల్ దగ్గర, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ఇ లలో ఇలాంటి వారు  ఎందరో కనిపిస్తుంటారు. కాకపోతే చూసే వారే తక్కువ, ఫోను తెరని తప్ప మరి దేనిని అంతగా పరిశీలించి చూసే అలవాటు తప్పిన ఈ రోజులలో ,ఆ ఫోన్ ద్వారా నే ఆ వృద్ధులకు తమ వంతు సహాయం చేస్తున్నారు కొందరు. నిజమైన హీరోలు వన్ టూ సామాజిక మాధ్యమాలలో వారు పంచుకుంటున్న ఫోటోలు మన సమాజం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాయి. 

ఐ డోంట్ వాంట్ టు బెగ్ - ప్లీజ్ బై మై పెన్స్అంటూ  ప్లకార్డ్ పట్టుకున్న వృద్ధురాలు ఆత్మ గౌరవానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో పెన్ ఆంటీ గా పేరు పొందిన రతన్ బామ్మ కొన్ని నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. పెన్ను 10 రూపాయలు అంటూ బోసి నోటితో నవ్వుతున్న ఆమె ముఖం చూసి కొనకుండా ఎవరైనా ఉండగలరా ..నిజామాబాద్ పాత బస్టాండ్ దగ్గర ఎండలో పూలు అమ్ముతూ ఎదురైన వృద్ధురాలిని చూసి యువకుడు జాలిపడ్డాడు. జేబులోంచి నోటు తీసి ఇవ్వబోయాడు.. పూలు తీసుకో బాబు అప్పుడే ఈ డబ్బులు నావి అవుతాయి అంటూ దండం పెట్టింది ఆమె. కరోనా లాక్ డౌన్ తో గిరాకీ లేక కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీలోని ఒక చిన్న హోటల్ దంపతుల గాథ  ఎందరినో  చలింప చేసింది. మా దగ్గర భోజనం చేయండి చాలు అంటూ ఒక వీడియోలో ప్రాధేయపడడంతో వాళ్ల బాబాకా దాబా ముందు జనాలు క్యూ కట్టారు. ముంబై రైళ్లలో చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతున్న 90 ఏళ్ల తాతయ్య, సెరిబ్రల్ పాలసీతో బాధపడుతూ కూడా తన కాళ్ళపై తాను నిలబడాలని కొంగర్లు తిరిగిన వేళ్ళతోనే వీడియో ఎడిటింగ్ చేస్తున్న 22 ఏళ్లకు యువకుడు.. ఇలాంటి ఎందరో ఏరీలు లోనో కనబడతారు .స్వావలంబన ,నిజాయితీలకు నిదర్శనాలుగా నిలుస్తారు.

ఉరుకులు పరుగుల జీవితంలో అందరిలా తలవంచుకుని ఫోను చూసుకుంటూ పోకుండా, తలెత్తి చుట్టూ చూసిన యువతరానికి కనపడిన సమాజ ప్రతిబింబాలు పైన చెప్పిన వాళ్ళు. వారిని చూసి ఒక్క క్షణం అయ్యో పాపం అని జాలిపడి స్క్రోల్ చేస్తూ మరుక్షణం లో మర్చిపోయే వారు ఎందరో. ఆత్మగౌరవంతో బ్రతికే ప్రయత్నం చేస్తున్నందుకు అబ్బురపడి మరొకరికి షేర్ చేసేవారు కొందరు .ఇంకొందరు ఉంటారు ,వారి వివరాలు తెలుసుకొని చేతనైన ఆర్థిక సహాయం చేసి మౌనంగా తమ పని తాము చూసుకుంటారు.వారిది ఆత్మ గౌరవం, వీరిది మానవీయ హృదయం . ఇద్దరికీ జోహార్లు చెప్పడం మన కనీస కర్తవ్యం.

29, జనవరి 2026, గురువారం

మహిళా జన అధికార్ సమితి,అజ్మీర్, రాజస్థాన్.

 డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎం జె ఏ ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒక భాగం. మొదట అన్హాద్ ఫిలిమ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది .ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు.


బాల్యవివాహాల  సంకెళ్లలో చిక్కుకొని కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు .డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుని మహిళా కార్మికుల దయనీయ జీవితాలు గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు.. చాలావరకు విజయం సాధించారు కూడా . వీరు తమ ఆలోచనలను  సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధి ంచిన వీరు శిక్షకులుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు.

రాజస్థాన్లోని అజ్మీర్ లో అత్యంత సామాన్యంగా ఉండే రెండు అంతస్తుల భవనం ఉంది .అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేలుకుంటుంది. అన్ని వయసుల మహిళలు అక్కడ కనిపిస్తుంటారు. వారంతా బాల్య వివాహాల సంకెళ్ళకు బందీలే .నేడు ఆ మహిళలు బాలికలకు సాధికారత కలిపించడానికి మహిళా జన అధికార సమితి కార్యాలయంలోకి అడుగుపెడుతున్నారు. వీరంతా కెమెరాలు తీసుకొని షూటింగులకు వెళుతున్నారు. మరికొందరు తమ సినిమాలను ఎడిట్ చేయడానికి కంప్యూటర్ స్క్రీన్ల ముందు ఉంటున్నారు. అంతా కలిసి వారు కొత్త భవిష్యత్తుకు ఒక్కొక్క ఫ్రేమ్ నుస్క్రిప్ట్ చేస్తున్నారు.

డిజిటల్ అక్షరాస్యత ..మహిళా జన అధికార సమితి ఆఫీసులో 30 మందికి పైగా మహిళలు చిత్ర నిర్మాణం ఎడిటింగ్  నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. వారి కుటుంబాలలో కెమెరా పట్టుకొని ప్రపంచంపై దృష్టి సారించిన మొదటి వ్యక్తులు వీరే .పాతికేళ్ల క్రితం భూమి హక్కుల కోసం కుల వివక్ష బాల్యవివాహాలు పరువు హత్యలకు వ్యతిరేకంగా పోరాడిన మహిళల నేతృత్వంలోని అట్టడుగు వర్గాల నుంచి ఈ మహిళ జన అధికార సమితి పుట్టుకు వచ్చింది .నేడు అక్కడి మూడు జిల్లాలలో ఈ సమితి తన ఉనికిని కొనసాగిస్తోంది. డిజిటల్ అక్షరాస్యత, నాయకత్వ కార్యక్రమాలు, లింగ సమానత్వం, గృహహింసపై దృష్టి సారించింది. మహిళల ఆందోళనలను వ్యక్తపరచడానికి వారి జీవితాలలో, సమాజాలలో సానుకూల మార్పును తీసుకురావడానికి ఒక వేదికను ఏర్పాటు చేసింది.

గ్రామీణ మహిళల చేతిలో కంప్యూటర్ స్క్రీన్..

 ఈ ఆఫీసులోకి వెళ్లి చూస్తే ఎడిట్ రూమ్ లో 19 ఏళ్ల మంజు రావత్ తదేక దీక్షతో తన డెస్క టాప్ పైన సినిమాను ఎడిట్ చేస్తూ కనిపిస్తుంది .రెండేళ్ల క్రితం ఈ ఎన్జీవో లో చేరినప్పుడు ఆమె ఏకైక లక్ష్యం డిజిటల్ అక్షరాస్యత పొందడం .అయితే స్క్రిప్ట్, ఇంటర్వ్యూ ,కెమెరా వర్క్ తో సహా మహిళలకు ఫిల్మ్ మేకింగ్ నేర్పించాలని సంస్థ తీసుకున్న నిర్ణయం ఆమెలో ఆసక్తిని కలిగించింది. కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి మొదట మా ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు. కుటుంబంతో పాటు ఇరుగుపొరుగు వాళ్ళు ఆమె ఎలా తిరుగుతుందో చూడండి అనేవారు. కానీ వారి మాటలను పట్టించుకోలేదు అని చెబుతుంది మంజు రావత్. నాలుగేళ్ల వయసులోనే 20 ఏళ్ల వాడితో ముడిపెట్టిన చాందస కుటుంబం నుండి వచ్చిన రావత్ ఇప్పుడు తనలాంటి మహిళల సమస్యల పైన దృష్టి సారిస్తూ షార్ట్ ఫిలింలు తీసింది.

రావత్ చెల్లెలు సంజు వయసు 19 సంవత్సరాలు, ఆమె అజేసర్ గ్రామంలోని దినసరి కార్మికుల జీవితాలను చిత్రీకరించింది .

సవాళ్లను ఎదిరిస్తూ.. 24 ఏళ్ల భగవతి దేవికి 15 ఏళ్ల వయసులో  పెళ్లయి ంది. ఆమె తన గ్రామం భవానీ నుండి అజ్మీర్ కు ప్రతిరోజు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేది .భగవతీదేవి ముసుగు ధరించే ఆచారం పైన, తగిన ధ్రువపత్రాలు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాల నుండి మినహా యించిన సంచార జాతి ఘమంతు తెగపై సినిమాలను నిర్మించింది. కోర్సు నేర్చుకుంటున్న మహిళలందరూ ఒక్కొక్కరు ఒక్కో సినిమా తీశారు. వీరంతా పురుషుల నుంచి కుటుంబాల నుంచి తీవ్రమైన అణచివేతను ఎదుర్కొన్నవారే. 2025 ఏడాది మొదట్లో 23 ఏళ్ల సంత్ర చౌరాసియా, భగవతి దేవి మరో ఇద్దరూ కిషన్ ఘడ్ లో ఒక పెళ్లిని చిత్రీకరించారు. ఇది వారి మొదటి ప్రొఫెషనల్ ప్రాజెక్ట్. వీరు తీసిన సినిమాలను చూసిన స్థానిక మహిళలు సంతోషిస్తుండగా పురుషులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మేమంతా ఒక్కటిగా నడుస్తాం. ఏ అమ్మాయి అయినా మా డిజిటల్ క్లాసులకు రాలేక పోతే మేమే వారి ఇంటికి వెళ్లి వెంటబెట్టుకొని వస్తాం .కుటుంబ ఒత్తిడి కారణంగా ఎవరు ఈ డిజిటల్ చదువు మానేయకుండా చూసుకోవాలని మేమంతా నిర్ణయం తీసుకున్నాం అని 22 ఏళ్ల మేరీ అంటున్నారు..

గతంలో మా కాలనీలో ఎడిటింగ్ నేర్చుకోవడానికి ఇంటి నుండి బయటకు వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే. ఇప్పుడు చాలామంది మహిళలు నాతో చేరారు. ఇది మా సమిష్టి విజయం అని 21 ఏళ్ల ట్రైనర్ సమీరా భాను గర్వంగా చెబుతున్నారు. స్థానికంగా మహిళలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యల పైన సినిమాలు తీస్తూ వాటిని గ్రామంలో ప్రదర్శిస్తూ అవగాహన తీసుకువస్తున్నారు. మహిళాభివృద్ధికి ఏ విధంగా తోడ్పాటును అందించాలో తమ సినిమాల ద్వారా చూపుతున్నారు ఈ మహిళలు.


షీల్డ్ షూర్ ఇన్సూరెన్స్ ,థానే

 చిన్న పట్టణాలకు చెందిన ముగ్గురు మహిళలు కలిసి మన దేశ భీమా రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు సంకల్ప బలం కలిగిన ఆ మహిళలు ఎవరంటే నైనా చౌహాన్ ,అనుశ్రీ వాస్తవ, షీబా నాజ్.

ఈ ముగ్గురు మహిళలు మన దేశంలో తొలిసారి డిస్కౌంట్ ఆధారిత బీమా స్టార్టప్ షీల్డ్ ఇన్సూరెన్స్ ప్రారంభించారు. థానే ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఈ స్టార్టప్ కు నైనా చౌహాన్ ఫౌండర్, అను శ్రీ  శ్రీ వాస్తవ కో ఫౌండర్, షీబా నాజ్ సి ఓ ఓ గా వ్యవహరిస్తున్నారు.

ప్రతి భారతీయ కుటుంబానికి భీమాను అందుబాటులోకి తీసుకురావాలి అనే లక్ష్యంతో స్టార్టప్ ప్రారంభించారు వీరు. మిగిలిన కంపెనీలతో పోల్చితే షీల్డ్ ష్యూర్ ను ప్రత్యేకంగా నిలబెట్టేది మహిళా సాధికారికత పట్ల దాని బలమైన నిబద్ధత అంటుంది కోపౌండర్ అనుశ్రీ. దీనిలో 90 శాతం మందికి పైగా ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. క్షేత్రస్థాయిలో కూడా ఎక్కువమంది మహిళలే ఉండేలా చూసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మా లక్ష్యం బీమాను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా భారతదేశం అంతటా మహిళలకు ఆర్థిక స్వాతంత్రాన్ని సృష్టించడం అంటుంది ఫౌండర్ నైనా. ప్రతి బీమా పాలసీపై ఐదు నుండి 25% డిస్కౌంట్ కూపన్లను అందిస్తోంది వీరి సంస్థ.



పర్యావరణహిత.. ప్రాజెక్టు ముంబై

 ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి ముంబైలోని స్వచ్ఛంద సంస్థ " ప్రాజెక్టు ముంబై " ప్లాస్టిక్  రీసైక్లోథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చిన్నగా మొదలైన ఈ కార్యక్రమం ఉద్యమ స్థాయికి చేరింది. సాధారణ పౌరులు ఈ ఉద్యమంలో భాగమవుతున్నారు.

ప్రాజెక్టు ముంబైకి చెందిన స్వచ్ఛంద సేవకులు ఇంటింటికి వెళ్లి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు. విద్యార్థుల కోసం పాఠశాలలు కాలేజీలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది ప్రాజెక్టు ముంబై.  పౌరుల నేతృత్వంలో ప్లాస్టిక్ ని రీసైకిల్ చేయడానికి ఏర్పడిన అతిపెద్ద సంస్థగా లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సాధి ంచింది ప్రాజెక్టు ముంబై. ఇప్పటివరకు 500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది. పార్కులలో పిల్లలు కూర్చునే బెంచీలను ,ఆడుకునే అందమైన బొమ్మలను, అందమైన చెత్త బుట్ట లను,ఇలా రకరకాల వస్తువులను తయారు చేసి ప్లాస్టిక్ ను పునర్వినియోగంలోకి తీసుకువచ్చింది.



బెంగళూరు రమేష్ బాబు

 బెంగళూరుకు చెందిన రమేష్ తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. రమేష్ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. కుటుంబ భారాన్ని భుజాల ఎత్తుకున్న తల్లి ఇండ్లలో పనిచేసేది .కుటుంబానికి ఆర్థిక ఆసరా కోసం చిన్న వయసు నుంచే న్యూస్ పేపర్ లు అమ్మడం ,పాల ప్యాకెట్లు అమ్మడం మొదలైన పనులు చేసేవాడు రమేష్ .హై స్కూల్ చదువు పూర్తయిన తర్వాత పై చదువుల కోసం రోడ్డు పక్కన చిన్న సెలూన్ షాప్ నడిపేవాడు. తాను పొదుపు చేసిన డబ్బుతో 1993లో మారుతి వ్యాను తీసు. అది అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ వ్యాన్ ను అద్దె కి తిప్పే వాడు..

ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో కార్ రెంటల్స్ కంపెనీ ప్రారంభించే స్థాయి కి చేరుకున్నాడు. రోల్స్ రాయిస్ ఘోస్ట్, బీఎండబ్ల్యూ, ల్యాండ్ రోవర్, డిఫెండర్ మొదలైన వాటితో తన కంపెనీని లగ్జరీ కార్ రెంటల్ సర్వీసెస్ స్థాయి కి తీసుకువెళ్లాడు.

 ప్రస్తుతం కంపెనీ 400 వాహనాలను ఆపరేట్ చేస్తోంది. మన దేశానికి సంబంధించి లగ్జరీ టాక్సిస్ సెగ్మెంట్లో రమేష్ బాబు మార్గదర్శిగా నిలిచాడు. తాజాగా రమేష్ బాబు తన కంపెనీలోకి మూడు కోట్ల 20 లక్షల విలువైన రేంజ్ రోవర్ లాంగ్ వీల్ బేస్ తీసుకొచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలను కంపెనీ అధికారిక ఇంస్టా గ్రామ్ పేజీలలో షేర్ చేశారు. ఈ ఫోటోలో తన కుటుంబ సభ్యులతో కనిపిస్తారు రమేష్ బాబు.




Featured post

MANALO MANAM ...MANATHO MANAM