పెన్ ఆంటీ.. రతన్ బామ్మ@పుణె

 


నడక తడబడుతున్న చేతులు వణుకుతున్న ఎండ వానలను లెక్క చేయకుండా కొందరు వృద్ధులు పనులు చేస్తుంటారు. పేదరికం వల్ల, తప్పనిసరై ,బిడ్డలకు భారం కాకుండా, తాము ఒక చేయి వేయాలని కష్టం చేయడానికి  వాళ్లు రోడ్డు ఎక్కుతారు. ఏవైనా వస్తువులు అమ్మడం, హస్తకళా రూపాలు తయారు చేయడం, పాటతోను, వాద్యంతోను, అలరించడం చేస్తూ ఉంటారు. ప్రతిఫలంగానే తప్ప ఉచితంగా డబ్బు తీసుకోరు. సిగ్నల్ దగ్గర, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ఇ లలో ఇలాంటి వారు  ఎందరో కనిపిస్తుంటారు. కాకపోతే చూసే వారే తక్కువ, ఫోను తెరని తప్ప మరి దేనిని అంతగా పరిశీలించి చూసే అలవాటు తప్పిన ఈ రోజులలో ,ఆ ఫోన్ ద్వారా నే ఆ వృద్ధులకు తమ వంతు సహాయం చేస్తున్నారు కొందరు. నిజమైన హీరోలు వన్ టూ సామాజిక మాధ్యమాలలో వారు పంచుకుంటున్న ఫోటోలు మన సమాజం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాయి. 

ఐ డోంట్ వాంట్ టు బెగ్ - ప్లీజ్ బై మై పెన్స్అంటూ  ప్లకార్డ్ పట్టుకున్న వృద్ధురాలు ఆత్మ గౌరవానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో పెన్ ఆంటీ గా పేరు పొందిన రతన్ బామ్మ కొన్ని నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. పెన్ను 10 రూపాయలు అంటూ బోసి నోటితో నవ్వుతున్న ఆమె ముఖం చూసి కొనకుండా ఎవరైనా ఉండగలరా ..నిజామాబాద్ పాత బస్టాండ్ దగ్గర ఎండలో పూలు అమ్ముతూ ఎదురైన వృద్ధురాలిని చూసి యువకుడు జాలిపడ్డాడు. జేబులోంచి నోటు తీసి ఇవ్వబోయాడు.. పూలు తీసుకో బాబు అప్పుడే ఈ డబ్బులు నావి అవుతాయి అంటూ దండం పెట్టింది ఆమె. కరోనా లాక్ డౌన్ తో గిరాకీ లేక కన్నీళ్లు పెట్టుకున్న ఢిల్లీలోని ఒక చిన్న హోటల్ దంపతుల గాథ  ఎందరినో  చలింప చేసింది. మా దగ్గర భోజనం చేయండి చాలు అంటూ ఒక వీడియోలో ప్రాధేయపడడంతో వాళ్ల బాబాకా దాబా ముందు జనాలు క్యూ కట్టారు. ముంబై రైళ్లలో చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముతున్న 90 ఏళ్ల తాతయ్య, సెరిబ్రల్ పాలసీతో బాధపడుతూ కూడా తన కాళ్ళపై తాను నిలబడాలని కొంగర్లు తిరిగిన వేళ్ళతోనే వీడియో ఎడిటింగ్ చేస్తున్న 22 ఏళ్లకు యువకుడు.. ఇలాంటి ఎందరో ఏరీలు లోనో కనబడతారు .స్వావలంబన ,నిజాయితీలకు నిదర్శనాలుగా నిలుస్తారు.

ఉరుకులు పరుగుల జీవితంలో అందరిలా తలవంచుకుని ఫోను చూసుకుంటూ పోకుండా, తలెత్తి చుట్టూ చూసిన యువతరానికి కనపడిన సమాజ ప్రతిబింబాలు పైన చెప్పిన వాళ్ళు. వారిని చూసి ఒక్క క్షణం అయ్యో పాపం అని జాలిపడి స్క్రోల్ చేస్తూ మరుక్షణం లో మర్చిపోయే వారు ఎందరో. ఆత్మగౌరవంతో బ్రతికే ప్రయత్నం చేస్తున్నందుకు అబ్బురపడి మరొకరికి షేర్ చేసేవారు కొందరు .ఇంకొందరు ఉంటారు ,వారి వివరాలు తెలుసుకొని చేతనైన ఆర్థిక సహాయం చేసి మౌనంగా తమ పని తాము చూసుకుంటారు.వారిది ఆత్మ గౌరవం, వీరిది మానవీయ హృదయం . ఇద్దరికీ జోహార్లు చెప్పడం మన కనీస కర్తవ్యం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

DR.PAVULURI KRISHNA CHOWDARY GARU - RENOWNED HOMEO PHYSICIAN - ANDHRA PRADESH

IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU