12, అక్టోబర్ 2026, సోమవారం

నాలుగు మంచి మాటలు 12-10-2026

 విత్తనాలు..

మీ మనసు ఒక తోట లాంటిది. మీరు శాంతి, ఆనందం, కృతజ్ఞత అనే విత్తనాలను నాటక పోతే చింత, ఆందోళన అనే కలుపు మొక్కలు సహజంగానే పెరుగుతాయి. మన మానస్థిక స్థితిని మనమే మలుచుకోవాలి. సానుకూల ఆలోచన లను నాటుకోవాలి... హంసాజీ యోగేంద్ర, యోగ గురువు

మనసుకు ఎలాంటి సమాచారం ఇవ్వాలంటే.. 

మీ మనసుకు మీరు అందిస్తున్న సమాచారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి.మీరు రోజూ కేవలం ఆర్థిక కష్టాలు,పెరుగుతున్న ధరలు, వ్యాపార నష్టాలు,డబ్బు సంపాదనలో ఉండే అడ్డంకుల గురించి తెలిపే సమాచారాన్నే చూస్తుంటే..భవిష్యత్తులో ఇక కష్టపడినా ఎలాంటి అర్థం లేదు అని మీరే నమ్మడం ప్రారంభిస్తారు.

- ఓ. పీ. జిరి,ఫైనాన్షియల్ మెంటార్..

కేవలం ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మహిళల జీవితాలు మారిపోవు.వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు, సొంత సంపాదనకు దారులు చూపించినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

- జయతీ ఘోష్, ఆర్థిక వేత్త.

ఆరోగ్యకర జీర్ణ వ్యవస్థ తోనే..

పేగుల గోడ కేవలం ఒకే పొర కణాలతో నిర్మాణమై ఉంటుంది. జంక్ ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం తిన్నప్పుడు ఆ రక్షణ పొర దెబ్బ తింటుంది.దాంతో హానికర క్రిములు రక్తంలోకి చేరతాయి.ఇవి శరీరంలోని ఇన్ఫ్లమేషన్ ను పెంచి ఇన్సులిన్ పని చేసే విధానం దెబ్బ తీస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే జీవక్రియను మెరుగు పరుచుకోవచ్చు.

- సుమిత్ శర్మ,డాక్టర్.

ప్రతి నిర్ణయానికి వివరణ అవసరం లేదు..

మీరు ఎదుటివారి జీవితం నుంచి ఎందుకు వెళ్ళిపోయారో వివరించాల్సిన అవసరం ఉందని ఒక దశ తర్వాత మీకు అనిపించదు.ఎందుకంటే మీతో కలిసి ఆ పరిస్థితిని అనుభవించిన వారికి అసలు నిజం ఏంటో తెలిసే ఉంటుంది మిమ్మల్ని అర్థం చేసుకోని వారికి వేయి మాటలు చెప్పినా వారిలో మార్పు రాదు. మీ ప్రతి నిర్ణయానికి అందరి మద్దతు అవసరం లేదనే నిజం గ్రహించినప్పుడే అసలైన స్వేచ్ఛ దొరుకుతుంది.

- డేవ్,కంటెంట్ క్రియేటర్.

డబ్బు ఆదా కు సులభ మార్గాలు..

పెళ్ళికి ముందే మీ కెరీర్,సంపాదనను సెట్ చేసుకోవడం,డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ వాడడం,భారీ అద్దె ఖర్చులను తగ్గించుకోవడం,విలాసాల కోసం అప్పులు చేయకపోవడం..లాంటివి డబ్బును ఆదా చేయడం లో సహాయ పడతాయి.

- మార్క్ టిల్బరీ, ఆంత్ర ప్రేన్యూర్ 

ప్రయత్నం లేకుండానే తన లక్ష్యాన్ని సాధించగలనని భావించడం ,శిక్షణ లేని మనసు లక్షణం. కేవలం ఆశించడం వల్ల ఏమీ సాధించలేము... అలైస్టర్జ్ క్రౌలీ.. 

టీమ్ వర్క్..

ఒక బృందంగా ఏదైనా సాధించడంలో ఉండే ఆనందం, వ్యక్తిగత విజయాని కన్నా చాలా గొప్పది .ఒక్కరి ప్రతిభ మిమ్మల్ని కొంత దూరం మాత్రమే తీసుకు వెళ్ళగలదు . వ్యాపారము మొదలు ఏ ఇతర రంగంలో నైనా సంపూర్ణ విజయానికి జట్టు కృషి యే కీలకం.. కుమార మంగళం బిర్లా,ఆదిత్య గ్రూప్ చైర్మన్.. 


Featured post

MANALO MANAM ...MANATHO MANAM