19, అక్టోబర్ 2026, సోమవారం

చిన్న చిన్న అలవాట్లే..

 నాలుగు మంచి మాటలు 19-10-2026

చిన్న చిన్న అలవాట్లే మంచి భవిష్యత్తును నిర్మిస్తాయి..

ఏ ఒక్కరూ తమ జీవితాన్ని రాత్రికి రాత్రి పాడుచేసుకోరు వ్యాయామం మానేయడం పనులను రేపటికి వాయిదా వేయడం వంటి చిన్న చిన్న సాకులు చెబుతూ పోవడం వల్లనే జీవితం చెడిపోతుంది అలవాట్లే భవిష్యత్తును శాసిస్తాయి. 

జైమ్ మెక్ అలిస్టర్.. కంటెంట్ క్రియేటర్.. 

వయసుతోపాటు ఆలోచనలు మారాలి..

వయసు 40 దాటిన తర్వాత నేను ఏ ఏ ఆహారాలు మానేయాలి అని మాత్రమే ఆలోచించకండి. బదులుగా నా శరీరానికి ఇప్పుడు ఏది తక్కువవుతుంది అని ప్రశ్నించుకోండి .ప్రోటీన్లు, కూరగాయలు, పీచు పదార్థాలతో కూడిన నాణ్యమైన ఆహారంతో మీ భోజనాన్ని ప్రారంభం చేయండి. 

బిగ్లీ మురళి, ఫిట్ నెస్ కోచ్ . 

వ్యక్తిగత అభివృద్ధి అనేది ఇమిడి ఉండేది ఈ మూడు అంశాలలోని..

పనులను క్రమం తప్పకుండా చేస్తూ ఉండడం,  పూర్తిగా సిద్ధంగా లేకపోయినా ముందే పని మొదలుపెట్టడం.. పదిమంది ఏమనుకుంటారో అని ఆందోళన చెందకపోవడం ..వ్యక్తిగత అభివృద్ధి/సెల్ఫ్ హెల్ప్ రంగంలోని సారాంశం ఇదే..

డిక్కీ బుష్..రచయిత.

ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నారా..

సోషల్ మీడియాలో కనిపించే కృత్రిమ టెక్నికులు మోజులను పక్కనపెట్టి మీ జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం పై దృష్టి పెట్టండి. బరువు పెరగకుండా ఉండడం ,వ్యాయామాలు చేయడం, శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవడం , స్నేహితులతో సమయం గడపడం, ఉదయం లేవడానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం వంటివి చేయండి. ఇవన్నీ మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడతాయి. 

డాన్ గో.. పెర్ఫార్మెన్స్ కోచ్..

ప్రేమించమనో, వద్దు అనో మనం ఎవరిని బలవంతం చేయలేము  అసలు హృదయం అనేదే ఎవరి నియంత్రణలో లేనిది. అదే దాని బలము, బలహీనత. అందుకే దానితో ఆడుకోకూడదు.

..చిత్రా బెనర్జీ దివాకరుని,రచయిత్రి.

మనం కోరుకునే లక్షణాలు మనలోనే ఉండాలి..

నిస్వార్థం ఉన్న జీవిత భాగస్వామి మీ అవసరాలను గుర్తిస్తారు. ఎలాంటి లెక్కలు వేసుకోకుండా త్యాగాలు చేస్తారు. మీ ఇద్దరి సంతోషానికి ప్రాధాన్యతను ఇస్తారు. ప్రేమ అంటే కేవలం తీసుకోవడమే కాదు ఇవ్వడం అని కూడా అని వారు గ్రహిస్తారు .అయితే అలాంటి భాగస్వామిని కోరుకునే ముందు మీలో అలాంటి లక్షణాలు ఉన్నాయో లేదో సరి చూసుకోండి. 

డెరాన్ ఇ షార్ట్ , రచయిత.. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Featured post

MANALO MANAM ...MANATHO MANAM