పోస్ట్‌లు
ఏప్రిల్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది
IN THE LAST DAYS OF TANGUTURI PRAKASAM PANTHULU
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
Tanగుటూరి ప్రకాశం పంతులుగారు ఆంధ్రుల అభిమాన నాయకుడు. ఆంధ్రకేసరిగా పిలు చుకోబడిన వ్యక్తి. సంయుక్త మద్రాసు రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా పనిచేశారు. తెలుగువారి తొలి రాష్ట్రం ఆంధ్రకు తొలి ముఖ్యమంత్రి టంగుటూరి. జవహర్‌లాల్ నెహ్రూతో సహా ఎవ్వరితోనైనా అవసర మైతే ఢీ కొనటానికి వెనకాడనివాడు. బారిష్టర్ గా ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయల్ని ఆర్జిస్తున్న ప్రకాశం దేశ స్వాతంత్ర్యం సర్వం త్యాగంచేశారు. చెన్నపట్నం, రాజమండ్రి, ఒంగోలులో భవంతులు నిర్మించుకుని ఆ రోజుల్లోనే ఖరీదైన కార్లలో తిరిగినవాడు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తీర్మా నం చేయించి కర్నూలు రాజధానిగా రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ ని వీడి ప్రజా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుచేశాడు. ఆయన నిర్ణయాలు తీసుకునే సాహసి. ఇలా ముఖ్యమంత్రి అవగానే అలా కృష్ణా బ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. అటు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. కొందరు నాయకులను, కాంగ్రెస్ అధిష్టానం దగ్గరికి తీసింది. ప్రకాశం పంతులుకు ప్రజలలో వున్న పలుకుబడి తెలుసు కాబట్టి ఆయనతో ప్రత...
DABBAVALA OF MUMBAI - DISCIPLINED WORKERS
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
THE LAST DAYS OF ACTOR SHOBHAN BABU
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
teలుగు సినీరంగంలో 'సోగ్గాడు' శోభన్బాబు, సినీ రంగం మీద మమకారంతో చెన్నపట్నం చేరిన చాలామందిలాగానే కాళ్ళు అరిగేలా సినిమా స్టూడియోల చుట్టూ తిరిగినవాడు. ఒక అవకాశంరాగానే దానిని అంటి పుచ్చుకుని, సినీరంగంలో స్థిరపడి నటనలో కన్నా పంపు దలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన హీరో. నిజజీవితంలో మనం ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కొందరి జీవితాలు చూసి ఎలా జీవించాలో తెలుసుకుంటే, మరికొందరి జీవితాలు చూసి ఎలా బతకకూడదో తెలుసుకోవచ్చు, శోభన్బాబు రెండవ సూత్రాన్ని బాగా వంటపట్టించు కున్నాడు. తన ముందు తరం నటులనుండి నటన ఎంత నేర్చుకున్నాడో కాని ఆర్థిక వ్యవహారాలలో ఎలా వ్యవహ రించాలో మాత్రం బాగా నేర్చుకున్నాడు. లక్షలాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ, కోట్లాది రూపాయల ఆస్తులు కూడగట్టుకుని కూడా వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలు వేసు కుని శవయాత్ర జరిపించుకున్న నటులున్నారు. తన అందచందాలు శాశ్వతమనుకుని, ఆ అందచందా లను చూసి వశమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడి జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశాడు. నటనలో ఒక స్థాయికి చేది, తను సంపాదించినది తిరిగి సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని చూశాడు. అందుకే శ...
LAST DAYS OF ACTRESS MADHUBALA
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
ఆమె అందంలానే ఆమె పేరూ అందమైనదే! బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన మధుబాల ఆ తర్వాత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆమె చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత 1990లో ఓ సినిమా పత్రిక నిర్వహించిన బ్యాలెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక హీరోయిన్ గా మధు బాల ఎంపికైంది. దటీజ్ మధుబాల. డైరెక్టర్ కమల్ అమ్రోహి, నటుడు ప్రేమనాథ్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్, కేదార్ శర్మ, జుల్ఫికర్ ఆలీ భుట్టో లను ప్రేమించి, వారిచేత ప్రేమించబడి చివరికి గాయ కుడు కిషోర్ కుమార్ కి పేరుకే భార్యగా మారి, ప్రేమాభి మానాలకు నోచుకోలేక, అర్ధాంతరంగా 36 ఏళ్ళకే జీవి తాన్ని ముగించేసిందంటే విధి ఎంత బలీయమో!! తండ్రి అతుల్లాఖాన్ అంటే ఆమెకెంతో గౌరవం. ఆయన పదకొండుమంది సంతానంలో మధుబాల ఐదవ బిడ్డ. తండ్రి మాట జవదాటాలంటే ఆమెకు భయం. ఆ భయమే ఆమె జీవితాన్ని విషాదాంతంలో ముంచింది. మధుబాల అసలు పేరు ముంతాజ్ జాన్ బేగం. ముద్దు పేరు మజిలీ అప్పా. మధుబాలకు చిన్నప్పుడే గుండెజబ్బు ఉంది. ఆ జబ్బుందన్న సంగతి ఆమెకు తెలీదు. ఆ విషయం ఆమె తండ్రి దాచాడు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ప్రేమను గెలుచు కున్నా తండ్రి వ్యతిరేకతతో అతన్ని దూరంచేసుకుంది. ఇది ఆమె జీవితంలో పెద...
LAST DAYS OF ACTRESS SAVITHRI
- లింక్‌ను పొందండి
- X
- ఈమెయిల్
- ఇతర యాప్‌లు
నటులు ఎందరో వుంటారు. కాని మహానటులు ఒక్కరే వుంటారు. ఆ ఒకే ఒక్క మహానటి సావిత్రి. జీవించింది నలభై ఏడేళ్ళే- అయితేనేం చిరస్థాయిగా నిలిచే నటనా కీర్తి సంపాదించింది.. ఆమె సెట్లో ఉందంటే ఎస్.వి.రంగారావులాంటి నటుడు కూడా నటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకునేవాడట. సాటి నటీమణులకు ఆమె అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమెను తల చుకుంటే చాలు నటన అదే వస్తుంది. సావిత్రి తెలుగమ్మాయి అంటే తమిళులు నమ్మరు. ఒక్క తమిళులే కాదు,ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాషను అంత స్పష్టంగా, తన మాతృభాషలాగానే మాట్లాడగలి గిన నేర్పు ఆమెది. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు, తమిళ చలనచిత్రరంగంలో తిరుగులేని తారగా వెలు గొందిన సావిత్రి చివరిరోజులు అంత బాధాకరంగా గడు స్తాయని ఎవరూ అనుకుని వుండరు. సినిమా నటులకు నటన తప్పించి నురేదీ చేతకాదు అనుకుంటారు. కాని వారికీ మనసుంటుందని, అది స్పందిస్తుందని తెలియదు. సావిత్రి మనసు ప్రేమను కోరుకుంది. ప్రేమ పిచ్చిది అన్నమాట ఆమెకు బాగా అతుకుతుంది. జెమినీ గణేశన్ని పిచ్చిగా ప్రేమించింది. అతనికి అప్పటికే వివాహమైందని, అతనికి చాలామంది తారలతో సంబంధాలున్నాయని తెలుసు. ఆ విషయంలో ఆమెను హెచ్చరించనివారు లేరు. ఐనా రహస్యంగా మైస...