EACH AND EVERY POSTING IN THIS BLOG IS UNIQUE. SUCCESS SUTRAS OF WINNERS IN VARIOUS FIELDS OF THE SOCIETY , SKILLS FOR BETTER LIFE , BEHAVIOURAL TIPS TO MANAGE VARIOUS SITUATIONS ETC VALUABLE INFO IS PROVIDED TO MAKE YOU INSPIRE ,FIGHT AND WIN IN THE LIFE.THANK YOU .
Sunday, 30 March 2014
Friday, 28 March 2014
Thursday, 27 March 2014
KUM SHRAVYA ALLADI , KARIMNAGAR - SCIENTIST , ISRO
అంగారక గ్రహానికి 'మామ్' ప్రయాణం మొదలైంది. వేలమంది ఇస్రో శాస్త్ర వేత్తల
కృషి ఫలమిది. 'అంతటి ఘనత సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ
ఇస్రో శాస్త్ర వేత్తగా ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది' అంటోంది ఇరవై ఒక్క
ఏళ్ల శ్రావ్య. భారతదేశంలోని ఒకే ఒక్క స్పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో ఉచిత సీటు
సంపాదించి... చక్కని ప్రతిభతో అబ్దుల్ కలాం ప్రశంసలు అందుకుంది. అమ్మ
ప్రోత్సాహంతో తన కలను నెరవేర్చుకున్న తీరుని శ్రావ్య ఇలా వివరిస్తోంది.
ఇరవై ఒక్క ఏళ్లకే
ఇస్రో శాస్త్రవేత్త
అమ్మ చిన్నతనంలో ఆకాశం చూపిస్తూ గోరుముద్దలు
తినిపించేది. నేను చందమామను చూసి ఆడు
కుంటూ, అన్నం తింటుంటే ఎంతో ఆనందించేది. ఇవాళ
నేను అంతరిక్ష పరిశోధన కేంద్రంలో ఉద్యోగం సంపా
దించానంటే అంతే సంబరపడిపోతోంది. ఇరవై ఒక్క ఏళ్ల
లో తన నుంచి అందిపుచ్చుకున్న స్ఫూర్తె నేడు నేను ఇస్రో
శాస్త్రవేత్తగా నిలదొక్కుకోవడానికి కారణమైంది.
మా ఆమ్మ కరుణశ్రీకి చదువంటే చాలా ఇష్టం. తనకు
డిగ్రీ రెండో సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. నాన్న
శ్రావణ్ కుమార్ కరీంనగర్‌లో నీటిపారుదల శాఖ
ఉద్యోగి. చదువు విలువ తెలిసిన అమ్మ పెళ్లయ్యాక
ఊరకే ఉండలేదు. కాలేజీకెళ్లి డిగ్రీ పూర్తి చేసింది.
తరవాత అన్నయ్యా, నేనూ పుట్టాం. ఇంటి పనులూ, మా
బాధ్యతలతో ఏడేళ్లపాటు అమ్మ బిజీ మేం బడికి వెళ్లడం
మొదలు పెట్టగానే, తనూ చదవడం మొదలు పెట్టింది.
బీఈడీ పూర్తి చేసింది. తొలి ప్రయత్నంలోనే టీచర్
ఉద్యోగం తెచ్చుకుంది. అక్కడితో చదువు ఆపలేదు.
ఆదాయం వస్తోంది కదా అని సరిపెట్టుకోలేదు. మెదడు
కు ఎప్పుడూ పని చెప్పాలి' అంటూ దూరవిద్యలో లైబ్రరీ
సైన్సు, డిప్లొమా ఇన్ రూరల్ డెవలప్మెంట్ కోర్సులు
చదివింది. అమ్మ ఎప్పుడు పడుకునేది. ఎప్పుడు లేచేదో
తెలియదు కానీ ఇంటి పనులన్నీ అయిపోయేవి. స్కూల్లో
పాఠాలు చెప్పేది. సాయంత్రం పూట నన్ను చదివించేది.
తనూ చదువుకుంటూ... నేను హైస్కూలుకి వచ్చేసరికి
ఎమ్మెస్సీ కూడా పూర్తి చేసింది. ఇష్టంగా చేసే పని కోసం
ఎంత కష్టపడ్డా ఆనందంగానే ఉంటుంది అనేది అమ్మని
చూశాక అర్ధమైంది. ఎవరూ చెప్పకుండానే చదువుకోవడం,
హోంవర్క్ పూర్తి చేయడం, మార్కులు తెచ్చుకోవడం
వంటివన్నీ అమ్మ నుంచి సహజంగానే వచ్చాయి.
అమ్మానాన్నలు నన్ను అన్నయ్యతో సమానంగా చూసేవా
రు. నలుగురిలో కలిసిపోవడం, ఎక్కడికయినా ఒంటరిగా
వెళ్లి రావడం... స్వేచ్ఛనిచ్చారు. ప్రోత్సహించారు.
నేనే వెళ్లేదాన్ని....
తొమ్మిదో తరగతికి వచ్చాక ఐఐటీ కోచింగ్ లో చేర్పించా
రు. పొద్దున్నే ఐదింటికి క్లాస్. అప్పటికే అమ్మ వంట
పూర్తి చేసేది. నేను తయారై కోచింగ్ కి వెళ్లేదాన్ని
అట్నుంచి ఆటే బడికి. సాయంత్రం ఇంటికొచ్చాక పక్క
నుండి చదివించేది. పాపం... రెండేళ్ల పాటు అమ్మకి
ఒకటే పని. తన సమయమంతా నాకూ, ఉద్యోగానికే
కేటాయించింది. వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పక్కన పెట్టే
సింది. అప్పటి వరకూ నేను ఏ రంగంలోకి వెళ్లాలన్నది
స్పష్టత ఉండేది కాదు. అలాగని అమ్మానాన్నలు ఎప్పుడూ
వాళ్ల అభిప్రాయాలు నా మీద రుద్దలేదు. పిల్లలకు ఆస్తి
పాస్తుల కన్నా సొంత వ్యక్తిత్వాన్ని అందిస్తే వాళ్లకు
మంచి భవిష్యత్తు ఏర్పడుతుందనేది నా విషయంలో
రుజువైంది. పదో తరగతిలో ఉన్నప్పుడు నా స్నేహితు
లందరూ ఇంజినీరింగ్ గురించి మాట్లాడే వారు. నేను
మాత్రం భిన్నమైన కెరీర్ను ఎంచుకోవాలని అనుకునేదా
న్ని. పదో తరగతిలో తొంబై ఏడు శాతం మార్కులు
వచ్చాయి. ఇంటర్ చదివేందుకు హైదరాబాద్ లోని
హాస్టల్లో చేరా. మొదటిసారి ఇంటికి దూరంగా వచ్చి చదు
వుకోవడం కష్టంగానే అనిపించింది. ఇరుకు గదుల్లో
స్వేచ్ఛగా చదువుకోవడానికి వీలుండేది కాదు.
ఇబ్బందిపడ్డా. ఒకానొక సమయంలో మార్కులు కూడా
తగ్గాయి. ఒకసారి అమ్మానాన్నలు నన్ను చూడ్డానికి
వచ్చారు. నేను డల్ గా ఉండటం అమ్మ గమనించింది.
నా మానసిక పరిస్థితిని అర్ధం చేసుకుంది. ఇక తిరిగి
నాన్నతో వెళ్లలేదు. 'ఐదు నెలలు స్కూలుకి సెలవు పెడు
తున్నా నీ పరీక్షలు అయ్యాకే ఇంటికెళతాను" అంటూ
విడిగా గదిని అద్దెకు తీసుకుని, నాతో ఉండిపోయింది.
ఎన్ని పనులున్నా, ఎన్నో సంవత్సరాల పాటు పెద్దగా
సెలవులు పెట్టని అమ్మ నా కోసం అన్ని నెలలు సెలవు
పెట్టడం.... అమ్మ కష్టం వృథా అవకుండా, ఐఐటి ర్యాంకు
సాధించడమే లక్ష్యంగా రోజుకు పదహారు గంటలు
చదివా. 257 ర్యాంకు వచ్చింది.
ఆ పరిస్థితి రాదు అంది...
ఇంటర్‌లో ఉండగా మా లెక్చరర్లు స్పేస్ ఇంజినీరింగ్
గురించి ఆ
చెప్పేవారు. ఆ సబ్జెక్ట్ నాకెంతో ఆసక్తిగా
అనిపించింది. ఇస్రోలో ఉద్యోగం సాధించాలని అనుకునే
దాన్ని. అబ్దుల్ కలాం కృషితో త్రివేండ్రంలో ఏర్పాట్
స్పేస్ ఇంజినీరింగ్ కాలేజీలో చదివితేనే అది సాధ్యం
మరి ఐఐటీలో ర్యాంకు సాధించిన వాళ్లకే ఆ అవకాశం
సులువుగా లభిస్తుందని తెలిసింది. ఆ కాలేజీకి ఓ ప్రత్యేకత
ఉంది. మనదేశంలో స్పేస్ ఇంజినీరింగ్ కాలేజీ అదొక్కటే
అక్కడ చదివి, ప్రతిభ చూపిస్తేనే, ఇస్రోలో ఉద్యోగం
వస్తుంది. నాకొచ్చిన ర్యాంకుతో ఆ కాలేజీకి దరఖాస్తు
పంపేప్పుడు వేయి దేవుళ్లకు మొక్కుకున్నా. ఎందుకంటే,
అక్కడున్న సీట్లు నూట యాభై ఏడు. దేశ వ్యాప్తంగా
లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఫలితం
కోసం రోజూ ఆ కాలేజీ సైట్ చూసేదాన్ని, పదిహేను
రోజుల తరవాత ఒకరోజు అమ్మ నిద్ర లేపుతూ నువ్వు
కోరుకున్న చోటే సీటొచ్చింది. అదీ ఉచిత సీటు. ప్రతినెలా
నీకే స్టయిఫండ్ ఇస్తారు' అని చెప్పింది. ఆనందం పట్టలే
కపోయా. నాతో పాటూ మన రాష్ట్రం నుంచి ఎనిమిది
మంది అమ్మాయిలు ఎంపికయ్యారు.
కానీ మా బంధువులు కొందరు
'ఆడపిల్లని అంతదూరం పంపడం
ఎందుకు... ఇక్కడే ఏదో ఒక
కాలేజీలో ఇంజినీరింగ్ చేయించండి
అని అమ్మకు చెప్పారు. తను ఎవరి మాటలు పట్టించు
కోలేదు. ధైర్యం చెప్పి నన్ను అక్కడికి పంపింది. ఇక్కడ
అమ్మ ఇచ్చిన ఓ భరోసా గురించి చెప్పాలి. నాలుగేళ్లు
కోర్సు అయ్యాక చదువులో వెనకబడితే, మంచి మార్కులు
తెచ్చుకోకపోతే... కాలేజీ వాళ్లకు పెద్ద మొత్తంలో ఫీజు
డబ్బులూ, హాస్టల్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది.
"అలాంటి పరిస్థితి నీకు రాదు. వస్తే నేనున్నాను. దాని
గురించి ఆలోచించకు" అంది అమ్మ
కలాం అడిగారు...
అమ్మానాన్నలకి దూరంగా వేరే రాష్ట్రంలో, భోజనం
నచ్చేది కాదు. భాష రాక ఇబ్బందులు, ఇంటి మీద బెంగ.
క్లాసులో కూర్చున్నా అమ్మానాన్నలే గుర్తుకొచ్చే వారు.
అమ్మ రోజూ పొద్దున, సాయంత్రం నాతో మాట్లాడేది.
'నాలుగేళ్లు కష్టపడితే నీ కల నిజం అవుతుంది' అని
చెప్పేది. చదువు విషయానికొస్తే ఫిజికల్ సైన్సు నా
ప్రధాన సబ్జెక్టు. మార్కులు బాగా రావడంతో మరో కోర్ట్సూ
చదివే అవకాశం వచ్చింది. ఉపగ్రహం పనితీరూ,
నియంత్రణకు సంబంధించిన మరో అంశమూ తీసుకు
న్నా, కాలేజీ, చదువు తప్ప మరో ధ్యాస లేకుండా గడిపా
ఎప్పుడన్నా చూడాలనిపిస్తే అమ్మానాన్నలే నా దగ్గరకు
వచ్చేవారు. ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ఉన్నప్పుడు
ఒకసారి మా కాలేజీ ఛాన్సలర్ అబ్దుల్ కలాం వచ్చారు.
నేను ప్రాజెక్టు చేస్తుంటే నా పక్కన నిల్చుని... 'నువ్వేల
చేస్తున్నావో చెబితే తెలుసుకోవాలనుకుంటున్నా అన్నారు.
అంతటి గొప్ప వ్యక్తి నాతో మాట్లాడుతుంటే చాలా
ఉద్వేగానికి లోనయ్యా నా ప్రాజెక్టుని పది నిమిషాల
పాటు వివరించా 'చిన్న వయసులోనే స్పష్టతతో
వ్యవహరించి ఈ రంగాన్ని పెంచుకున్నందుకు అభినందన
లు' అని చెప్పారు. మర్నాడు ఆయనలో దిగిన ఫొటోలు
అమ్మానాన్నలకు పంపా. అవి చూసి ఎంతో గర్వపడ్డారు.
ఇలా తెలియకుండానే నాలుగేళ్లు గడిచిపోయాయి.
రోజులో ఎక్కువ సమయం ల్యాబ్ లో గడిపేదాన్ని.
ఉపగ్రహాల గురించి తెలుసుకుంటుంటే ఆసక్తిగా
అనిపించేది. అధ్యాపకులు చెప్పినవి. నెట్ లో సమాచారం
కలిపి పరీక్షలకు సిద్ధమయ్యేదాన్ని సరదాలూ,
సినిమాలు, షికార్లూ నా ప్రపంచంలో లేవు. పుస్తకాలే
నేస్తాలు. అలా
చదవబట్టే పదికి ఏడున్నర పాయింట్లతో
మెరిట్ లిస్టులో చోటు సాధించుకున్నా దాంతో నచ్చిన
ప్రాంతంలో పోస్టింగ్ కోరుకునే అవకాశం లభించింది.
మన రాష్ట్రం నుంచి వెళ్లిన వాళ్లలో ఈ అర్హత సాధించింది.
నేనొక్కదాన్నే. అమ్మానాన్నలకు దగ్గరగా ఉండొచ్చనే
ఉద్దేశంతో హైదరాబాద్ లోని రిమోట్ సెన్సింగ్ సెంటర్
ను ఎంచుకున్నా ప్రస్తుతం 'వాటర్ రిసోర్స్ మేనేజిమెంట్
విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. పదిరోజుల క్రితమే
ఉద్యోగంలో చేరా. ఇరవై రెండేళ్లకే కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగం... ఆర లక్ష జీతం తెచ్చుకోవడం చాలా గర్వంగా
ఉంది. ఎవరైనా ఈ రంగంలోకి రావాలనుకునే వారు
ఇంటర్ నుంచి త్రివేండ్రం స్పేస్ ఇంజినీరింగ్ కాలేజీ వెబ్
సైట్ ని చూస్తే నోటిఫికేషన్ వివరాలు తెలుస్తాయి.
సమాచారం
కావాలంటే
Shravya alladiegmail.com మెయిల్
చేయొచ్చు
ఐఐటీ కోచింగ్ కి వెళ్లే సమయంలో నాన్న కరీంనగర్ లో
ఉద్యోగం చేసేవారు. అన్నయ్య వేరే ప్రాంతంలో చదువుకునే
వాడు. నేనూ, అమ్మా వరంగల్ లో ఉండేవాళ్లం. ఐఐటీ
కోచింగికి తెల్లవారు జామున ఐదింటికి ఒంటరిగా వెళ్లాలంటే
చాలా భయం వేసేది. చలికాలంలో మంచూ, చీకటితో దారి
కనిపించేది కాదు. పైగా క్లాస్ కి నిమిషం ఆలస్యమైనా ఒప్పుకో
చేవారు కాదు. ప్రతిరోజూ ఓ సవాలుగా ఉంటేది. అయినా
ధైర్యం కూడదీసుకుని వెళ్లి వచ్చేదాన్ని
Wednesday, 26 March 2014
Sunday, 23 March 2014
Saturday, 22 March 2014
Friday, 21 March 2014
Subscribe to:
Posts (Atom)