25, ఏప్రిల్ 2012, బుధవారం

LAST DAYS OF ACTRESS MADHUBALA



ఆమె అందంలానే ఆమె పేరూ అందమైనదే!
బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించిన మధుబాల
ఆ తర్వాత తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను
ఆకట్టుకుంది.ఆమె చనిపోయిన రెండు దశాబ్దాల తర్వాత
1990లో ఓ సినిమా పత్రిక నిర్వహించిన బ్యాలెట్ లో
అత్యంత ప్రజాదరణ పొందిన ఏకైక హీరోయిన్ గా మధు
బాల ఎంపికైంది. దటీజ్ మధుబాల.
డైరెక్టర్ కమల్ అమ్రోహి, నటుడు ప్రేమనాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, కేదార్ శర్మ, జుల్ఫికర్ ఆలీ భుట్టో
లను ప్రేమించి, వారిచేత ప్రేమించబడి చివరికి గాయ
కుడు కిషోర్ కుమార్ కి పేరుకే భార్యగా మారి, ప్రేమాభి
మానాలకు నోచుకోలేక, అర్ధాంతరంగా 36 ఏళ్ళకే జీవి
తాన్ని ముగించేసిందంటే విధి ఎంత బలీయమో!!
తండ్రి అతుల్లాఖాన్ అంటే ఆమెకెంతో గౌరవం.
ఆయన పదకొండుమంది సంతానంలో మధుబాల ఐదవ
బిడ్డ. తండ్రి మాట జవదాటాలంటే ఆమెకు భయం. ఆ
భయమే ఆమె జీవితాన్ని విషాదాంతంలో ముంచింది.
మధుబాల అసలు పేరు ముంతాజ్ జాన్ బేగం.
ముద్దు పేరు మజిలీ అప్పా. మధుబాలకు చిన్నప్పుడే
గుండెజబ్బు ఉంది. ఆ జబ్బుందన్న సంగతి ఆమెకు
తెలీదు. ఆ విషయం ఆమె తండ్రి దాచాడు.
ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ప్రేమను గెలుచు
కున్నా తండ్రి వ్యతిరేకతతో అతన్ని దూరంచేసుకుంది.
ఇది ఆమె జీవితంలో పెద్ద విషాదం. లేకుంటే అతనికి
భార్య అయ్యేది. దిలీప్ అంటే ఆమెకెంతో ఇష్టం.
17 సంవత్సరాల వయసులో దిలీప్ కుమార్ సరసన
నటించింది. ఆమె అందానికి ముగ్ధుడైన దిలీప్ కుమార్
కూడా మధుబాలను ప్రేమించాడు. తండ్రి అతుల్లాఖానకు,
దిలీప్ కుమార్‌కు మధ్య మనస్ఫ
ర్థలు రావడంతో దిలీపు
దూరంకావలసి వచ్చింది.
దిలీపుమార్ను వదులు
కున్నాక తానెంత తప్పుచేశానో
అర్థంచేసుకుంది ఆమె. ప్రేమకు
దూరమై కృంగిపోయింది. మాన
సికంగా దెబ్బతింది. దాంతో ఆమె
ఆరోగ్యం క్రమేపీ క్షీణించింది.
అటువంటి సమయంలో
కె.ఎ.ఆసిఫ్ 'మొఘల్ ఎ ఆజమ్'
చిత్రంలో దిలీప్ కుమార్ పక్కన
నటించే అవకాశంవచ్చింది. కాద
నలేకపోయింది. కారణం ప్రియు
డితో నటించే అవకాశం రావడం
ఒకటైతే, అనార్కలి వంటి గొప్ప
పాత్ర లభించడం రెండు.
వెంటనే ఓ.కే. చేసింది.
కానీ ఆ సినిమా షూటింగ్
జరుగుతున్నంతకాలం మధు
బాల తండ్రి ఆమెకు కాపలాగా
వుండటంతో దిలీపుమారో
మాట్లాడలేకపోయింది.
ఆమె తండ్రి అలా తమని
మాట్లాడుకోనీకుండా జాగ్రత్తపడ
టంచూసి అతనికి ఇబ్బంది అని
పించి, తటస్థంగా వుండిపోయేసరికి ఇద్దరూ ఎడమొఖం
పెడముఖంగా ఉండిపోయారు.ఆ చిత్రం పూర్తయ్యేలోగా
ఆమె ఆరోగ్యం మరింత దెబ్బతింది. అనారోగ్యంవల్ల ఆమె
తూలిపోతూండేది. ఆఖరి సీ లో నటించేప్పుడు సంకెళ్ళ
వల్ల చేతులకు, కాళ్ళకు గాయాలయ్యాయి.ఆమె ప్రేమే ఆమెకు
శత్రువైంది. ఏ ఒక్కరితోటి
ప్రేమ సక్సెస్ అవ్వక కృంగి
పోయింది. ఆ సమయంలో
కిషోర్‌కుమార్ గాయకుడిగా
పరిచయమై, అప్పుడప్పుడే
పైకొస్తున్నాడు.
అతన్ని వివాహం చేసు
కుంటే తనకో తోడు దొరు
కుతుంది అనుకుంది. ఆ

సమయంలో అప్పుల్లో మునిగివున్న కిషోర్ కుమార్ మధు
బాల అడగ్గానే ఆనందంగా ఒప్పుకున్నాడు.ఆమెను వివా
హం చేసుకున్నాడు. మధుబాలవల్ల అప్పుల ఊబిలోంచి
బైటపడ్డాడు.
కానీ ఆమె అంటే అతనికెంతమాత్రం ప్రేమ
లేదు. దాంతో ఇద్దరి మధ్య ఘర్షణలొచ్చాయి.
చివరికి అనారోగ్యంతో 1960ల్లో తన నట జీవితా
నికి స్వస్తి చెప్పింది. ఇంత చేస్తే అప్పటికి ఆమె వయసు
28 సంవత్సరాలే. గుండెజబ్బు తీవ్రమవడంతో మెరుగైన
చికిత్సకోసం ఇంగ్లండ్ కు వెళ్ళింది.ఆమె పరిస్థితిని చూసిన
డాక్టర్లు పెదవి విరిచారు. గుండె ఆపరేషన్‌కు తట్టుకోలేదని
స్థిరనిశ్చయానికి వచ్చారు. అదే చెప్పారు.
.
తిరిగి మాతృదేశం చేరుకుంది మధుబాల.
'ఆరాధన' సినిమా 1969లో విడుదలైంది.ఆ చిత్రంలో
కిషోర్‌కుమార్పడిన పాటలకు దేశమంతా ఉర్రూతలూగి
పోయింది. గాయకుడిగా డిమాండ్ పెరిగింది. ఆఫర్స్
ఇబ్బడి ముబ్బడిగా వచ్చిపడ్డాయి. ఆర్థికంగా కుదుట
పడ్డాడు. మధుబాలను నిర్లక్ష్యం చేశాడు.
.
ఏ ఒక్కరి ప్రేమా దక్కక చివరి రోజుల్లో అల్లాడి
పోయింది మధుబాల. కనీసం నోరారా పలకరించే మనిషే
లేడు. అప్పుడప్పుడు వచ్చి పలకరించే తన పుట్టింటివారు,
ఒకరిద్దరు సన్నిహితులు తప్ప ఇంకెవరూ వచ్చేవారు
కాదు. ఒంటరిగా వున్న సమయంలో తన ప్రేమికుల
గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ వుండిపోయేది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా, ఇంకా ఆమె
అప్పటికి ముంబై చేరలేదు. సినిమాల్లోకి రాలేదు. ఆ
రోజుల్లో ఆమెకు లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు. ఆమె
వస్తూవస్తూ అతనికో గులాబీపువ్వు ఇచ్చింది.చివరి రోజుల్లో
ఆమెకు అతను తరచుగా గుర్తిస్తుండేవాడు.
కేదార్ శర్మ, కమల్ అమ్రోహి, ప్రేమ నాథ్, అశోక్
కుమార్, దిలీప్ కుమార్, జుల్ఫికర్ ఆలీ భుట్టో, కిషోర్
కుమార్ ఇలా వరుసగా వారంతా ఆమె చివరి రోజుల్లో
గుర్తుకురాసాగారు. తన డైరీలో వారందరి జ్ఞాపకాలను
రాస్తూ, బాధపడుతూ వుండేది.
ఆఖరి ఘడియలు వచ్చాయని ఆమెకు అర్థమయ్యే
సరికి తానెంతో గాఢంగా ప్రేమించిన దిలీపుమారు
కలవరించడం మొదలు పెట్టింది. ఒక్కసారి వచ్చి కలసి
వెళ్ళమని ఉత్తరాల ద్వారా ప్రాథేయపడింది. దిలీప్
రాలేదు. ఆమెను పూర్తిగా మరిచిపోయాడు.ఆమె అప
రాధాన్ని అతను క్షమించలేకపోయాడు.
అయితే కూతురి దుఃఖాన్ని చూసిన ఆమె తండ్రి
కరిగిపోయాడు. ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయ
పడ్డా దిలీప్ కరగలేదు. ఆ విషయం తెలిస్తే మరింత
బాధపడుతుందని తండ్రి చెప్పలేదు. దాంతో తీరని వేద
నతో అనారోగ్యం నుండి కోలుకోలేకపోయింది. చివరి
వరకు దిలీప్ కోసమే
నగరంలో వుండగా, ఎదురుచూసింది.
-డ్ వుండేవాడు. అంత దుఃఖాన్ని ఆమె
అతనికో గులాబీ
గుండె మోయలేకపో
యింది. 1969 ఫిబ్రవరి
ఆమె మరణించాక
23వ తేదీన మధుబాల
విధుబాల ఇచ్చిన
తనువు చాలించింది. ఆమె
ఆమె సమాధిమీద మరణించినా అభిమానుల
అలర్పించాడు.
గుండెల్లో చిరస్థాయిగా
మిగిలేవుంది.
దిలీప్ కుమార్ ఆఖరి క్షణంలో శ్మశానానికైనా వస్తా
డనుకున్నారంతా. అతను రాలేదు. మధుబాల తండ్రి
ఆమె డైరీని కూడా సమాధిచేశాడు.
మధుబాల మరణించాక ఆమె బాల్యమిత్రుడు
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన గులాబీ పువ్వును ఆమె
సమాధి మీద ఉంచి నివాళులర్పించాడు. ఆమె జ్ఞాపకంగా
దాచుకున్నాడా గులాబీ పువ్వు.
ఆమె మరణించేనాటికి లతీఫ్ ఓ ఐఏఎస్ అధికారి.
ప్రతి సంవత్సరం ఆమె చనిపోయిన రోజు ఆమె సమాధి
మీద ఓ గులాబీ పువ్వును వుంచి వెళ్తుంటాడు.
'ప్యార్ కియాతో డర్‌
జబ్ ప్యార్ కియాతో
డర్‌ క్యా' 'మొఘల్ ఎ ఆజమ్'లో మధుబాల నర్తిస్తూ
నటించిన ఆ పాట మన చెవుల్లో ఇప్పటికీ, ఎప్పటికీ విన
బడుతూనే ఉంటుంది.
మధుబాల ఢిల్లీ నగరంలో వుండగా,
లతీఫ్ అనే ఫ్రెండ్ వుండేవాడు.
ఆమె వస్తూవస్తూ అతనికో గులాబీ
పువ్వు ఇచ్చింది. ఆమె మరణించాక
లతీఫ్ తనకు మధుబాల ఇచ్చిన
గులాబీపువ్వును ఆమె సమాధిమీద
ఉంచి నివాళులర్పించాడు. 

5, ఏప్రిల్ 2012, గురువారం

LAST DAYS OF ACTRESS SAVITHRI



నటులు ఎందరో వుంటారు. కాని మహానటులు
ఒక్కరే వుంటారు. ఆ ఒకే ఒక్క మహానటి సావిత్రి.
జీవించింది నలభై ఏడేళ్ళే- అయితేనేం చిరస్థాయిగా
నిలిచే నటనా కీర్తి సంపాదించింది..
ఆమె సెట్లో ఉందంటే ఎస్.వి.రంగారావులాంటి
నటుడు కూడా నటన విషయంలో జాగ్రత్తగా ఉండాలి
అని మనసులో అనుకునేవాడట. సాటి నటీమణులకు
ఆమె అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమెను తల
చుకుంటే చాలు నటన అదే వస్తుంది.
సావిత్రి తెలుగమ్మాయి అంటే తమిళులు నమ్మరు.
ఒక్క తమిళులే కాదు,ఆమె ఏ భాషలో నటిస్తే ఆ భాషను
అంత స్పష్టంగా, తన మాతృభాషలాగానే మాట్లాడగలి
గిన నేర్పు ఆమెది. రెండున్నర దశాబ్దాలపాటు తెలుగు,
తమిళ చలనచిత్రరంగంలో తిరుగులేని తారగా వెలు
గొందిన సావిత్రి చివరిరోజులు అంత బాధాకరంగా గడు
స్తాయని ఎవరూ అనుకుని వుండరు.
సినిమా నటులకు నటన తప్పించి నురేదీ చేతకాదు
అనుకుంటారు. కాని వారికీ మనసుంటుందని, అది
స్పందిస్తుందని తెలియదు. సావిత్రి మనసు ప్రేమను
కోరుకుంది. ప్రేమ పిచ్చిది అన్నమాట ఆమెకు బాగా
అతుకుతుంది. జెమినీ గణేశన్ని పిచ్చిగా ప్రేమించింది.
అతనికి అప్పటికే వివాహమైందని, అతనికి చాలామంది
తారలతో సంబంధాలున్నాయని తెలుసు.
ఆ విషయంలో ఆమెను హెచ్చరించనివారు లేరు.
ఐనా రహస్యంగా మైసూరు వెళ్ళి చాముండేశ్వరీదేవి సమ
క్షంలో పెళ్ళాడింది. అప్పటికి ఆమె వయసు రెండు పదు
ల్లోపే. ఆ వివాహమే ఆమె జీవితాన్ని మార్చివేసింది.
సావిత్రి సినీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పుడు జెమినీ
గణేశన్ ఆమె వెంటే వున్నాడు. తాను తాగుతూ సరదాగా
సావిత్రిని తాగమని అడిగాడు. అంతవరకు మందు
ముట్టని సావిత్రి తర్వాత జెమినీ గణేశన్ పుణ్యమా అని
మందు లేకుండా బతకలేని స్థితికి వచ్చింది.
ప్రతిరాత్రి మందు కావాలి. సినిమా అవకాశాలు తగ్గ
టంతో ఆదాయం తగ్గింది. అంతగా చదువుకోని సావిత్రి
అమాయకురాలు. ఆర్థికపరమైన లావాదేవీలు ఎలా నిర్వ
హించాలో తెలియదు. ఎవరినిపడితే వారిని నమ్మింది.
అవే ఆమెకు సమస్యలు తెచ్చి పెట్టాయి. సావిత్రి సంపాదన
మీద పెత్తనం చెలాయించాలను కున్న జెమినీ గణేశన్
చాలావరకు విజయం సాధించాడు. గుడ్డిగా తన ఆదాయ
మంతా భర్త చేతిలో పెట్టిందామె.
తెలుగులో వచ్చిన 'మూగమనసులు' సినిమా, అందులో
ఆమె పాత్రను ప్రేక్షకులు మరువలేరు. ఆ సినిమాను
తమిళంలో నిర్మించాలనుకుంది సావిత్రి. అందుకు
హీరోగా భర్తను ఎంపికచేసుకోవడం,దానిమీద భర్త అభ్యం
తరంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి. తన డబ్బు
తన ఆధీనంలో లేదన్న వాస్తవం తెలిసివచ్చింది.
సినిమా ఆగకూడదన్న పట్టుదలతో ఆ సినిమాను
పూర్తిచేసి విడుదల చేసింది. అంత చక్కని కథ కలిగిన
సినిమాను తమిళులు ఎందుకు తిరస్కరించారో తెలి
యదు. ఆర్థిక నష్టం, అప్పుల మీద వడ్డీలు. తన మాట
వినలేదన్న కోపంతో జెమినీ గణేశన్ ఇంటికి రావడం మానే
శాడు. ఎంతగానో ప్రేమించిన భర్త దూరమవడం ఆమె
ఆరోగ్యం మీద ప్రభావం చూపించాయి.
అధిక రక్తపోటు, షుగర్ జబ్బు వారి వంశంలో
వస్తున్న అనారోగ్యాలు. అవి రెండూ వున్నవారు తీసుకోవా
ల్సిన జాగ్రత్తలు సావిత్రి తీసుకోలేదు.
1971కల్లా సావిత్రి తాగుడుకు బానిస అయింది.
తాగుడు వద్దని దేవదాసుకు నీతిబోధ చేసిన ఈ సినీ
పార్వతి అదే తాగుడులో మునిగితేలింది. తాగుడు
తప్పించి తిండి తినదు. శరీరం, మనసు రెండూ పాడ
య్యాయి. సావిత్రి చుట్టూ వందిమాగధులు చేరి ఆమెను
ఉబ్బి తబ్బిబ్బు అయ్యేలా చేసేవారు.
ఆమెది మొదటి నుండి మహారాణి జీవితమే. మహా
రాణులు దానం చేసినట్టే తన దగ్గరున్నది అలా తీసి
ఇచ్చేది.
కాలం మారినా ఆమె అలవాటు మారలేదు. అడి
గినవారికి ఏదో ఒకటి ఇచ్చే అలవాటు పోలేదు.
ఇదంతా కూతురు, అల్లుడుకి నచ్చలేదు. ఆమె
వియ్యాలవారికీ నచ్చలేదు. వారు విధిస్తున్న ఆంక్షలకు
లోబడి బతకడం సావిత్రికి ఇష్టం లేదు. ఫలితంగా తాను,
మహారాణిలా బతికిన బంగళాను వదిలి కేవలం 500
రూపాయల అద్దెకు చెన్నపట్నంలోని అన్నానగర్ ప్రాంతా
నికి మారింది. ఆ చిన్న ఇంట్లోనే కొడుకుతో గడిపింది.
నాటివరకు సావిత్రి ఆదాయపుపన్ను సక్రమంగా
చెల్లించలేదు. దానిమీద నోటీసులు పంపించారు.
చాలాకాలం ఆ నోటీసులను పట్టించుకోలేనంత
మత్తులో ఉండిపోయింది. ఫలితం ఆదాయపుపన్ను
శాఖవారు వడ్డీల మీద వడ్డీలు లెక్కలు కట్టి లక్షలలో
బకాయి చూపించి కడతారా లేక ఆస్తులు జప్తు చేయ
మంటారా! అని బెదిరింపులు మొదలు పెట్టారు.
తాగుడు తనని పతనం చేసిందని ఆమె అర్థం చేసు
కుని, ఆ మత్తు బానిసత్వం నుండి బయటపడి మళ్ళీ
సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.
ఆ మహానటిని దర్శకత్వం వహించే అదృష్టం కోసం
ఎదురుచూస్తున్న దర్శకులు ఆదరించారు. ఆమెతో
నటించే మహదావకాశం కోసం ఎదురుచూసే నటులు
పొంగిపోయారు.
కాని పీక్కుపోయిన ఆమె ముఖం చూసి
ప్రేక్షకులు మాత్రం కంటతడి పెట్టారు.
ఒక కన్నడ షూటింగ్ కోసం బెంగళూరు వెళ్ళిన
సావిత్రి తన ఆస్తులన్నీ జప్తుచేసే నోటీసు వచ్చిందన్న'
విషయం తెలుసుకుంది. అప్పటికి రెండు మూడేళ్ళుగా
మందు మానేసిన సావిత్రి ఆ రోజు హోటల్లో తిరిగి తాగ
డం మొదలు పెట్టింది. దగ్గర ఎవరూ లేరు.
తాగడం మొదలు పెట్టిన తర్వాత ఇక ఆపడం తెలి
యలేదు. తెప్పించుకున్న ఆహారం తినలేదు. అప్పటికే
ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేయించుకోవాల్సిన అవసరం
ఏర్పడింది. తనకు తానుగా ఇన్సులిన్ డోస్ తీసుకుం
టుండేది. కాని ఆరోజు ఆ ఇంజెక్షన్ తీసుకుందో లేదో
తెలియదు. తీసుకుంటే వెంటనే ఏదోకటి తినాలి. కొడుకు
సతీష్ బలవంతం చేస్తే బిస్కెట్ మాత్రం తిన్నది.
"మైసూరు నుండి బెంగళూరు మీదుగా మద్రాసు వెళ్ళే
టప్పుడు ఇక్కడ ఆగి ఒక కుక్క పిల్లను కొని తీసుకువెళ
దాం" అని కొడుకుతో చెపుతూ నిద్రలోకి జారుకుంది.
తెల్లవారింది. కాని ఆ మహానటి నిద్రలేవలేదు. నోటి
వెంట నురగ వస్తోంది. విషపుపురుగు కుట్టిందేమో అని
అనుకున్నారు. కాని ఆమె డయాబెటిక్ కోమాలోకి
వెళ్ళింది. ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుని ఆహారం తిననం
దున ఆమెకువచ్చిన ఇబ్బంది అది. 1980 మే 11న
కోమా
లోకి వెళ్ళిన మహానటి 1981 డిశంబరు 26న మరణించే
వరకు ఆమె పరిస్థితిలో ఏ మార్పులేదు.
ఎప్పుడైనా ఎవరైనా వెళితే కళ్ళు తెరచి చూసినా ఆమె
గుర్తుపట్టిందో లేదో తెలియని పరిస్థితి. ఆమెకు నచ్చిన
పాటలు వినిపిస్తే స్పందిస్తుందని అనుకుని ఆమె నటిం
చిన పాటలు వినిపించేవారు. 'దేవదాసు' సినిమాలోని
'కలయిదనీ... నిజమిదనీ... బ్రతుకింతేనులే' పాటకు
కొంచెం కదలిక చూపించేదంటారు.
బక్కచిక్కిపోయి, ఎముకలగూడులా మారిపోయిన
సావిత్రి, శరీరంలోని ఒక్కొక్క అంగం పనిచేయడం మానే
స్తుంటే ఆమె ఎప్పటికైనా కోలుకుంటుందేమోనన్న ఆశతో
గొట్టం ద్వారా ద్రవ ఆహార పదార్థాలను ఎక్కిస్తూ వైద్యులు
చెయ్యగలిగినదంతా చేశారు.
మహానటి సావిత్రి సినిమాలలో ఎన్నో పాత్రల ద్వారా
జీవితపోరాటం చేసింది.
కాని వ్యక్తిగత జీవితంలో మాత్రం
పోరాటం చెయ్యనంది. ఈ లోకం నుండి ఎంత త్వరగా
వెళ్ళిపోదామా అనే ప్రయత్నమే ఆమెది.
ఎన్నో రకాలుగా ఆమెను వేధించిన విధి చివరిలో
సహకరించిందేమో! కాని ఆమె చెప్పాలనుకుంటున్న
చివరిమాటలేవో చెప్పకుండానే వెళ్ళిపోయింది.


Featured post

MANALO MANAM ...MANATHO MANAM