Thursday, 19 November 2020

SRI KAILASH KATTAR,QUICK HEAL TECHNOLOGIES PVT LTD, MUMBAI

 


కుటుంబ భారం మోయలేకపోతున్న తండ్రికి కుడిభుజంగా మారాలని పదో తరగతిలోనే చదువు మానేసినప్పుడు ఆ కుర్రాడు

బాధపడలేదు. పెద్ద కొడుకుగా అది తన బాధ్యత అనుకున్నాడు. ఆ బాధ్యతను నిలబెట్టుకోవటానికి కష్టపడ్డాడు. కళాశాల గడప తొక్కని

ఆనాటి యువకుడు ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలకు దీటుగా యాంటీవైరస్లు తయారుచేసే సంస్థకు యజమానిగా వేలకోట్ల రూపాయల

వ్యాపారం చేస్తున్నాడు. 1500 మందికి ఉపాధి కల్పించాడు.

కైలాష్ కట్టర్ తండ్రి పుణెలో ఓ ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పనిచేసేవాడు. పెరుగుతున్న ఖర్చులకు తండ్రి జీతం చాలకపోవడంతో

చదువుమానేసి రేడియోలూ కాలిక్యులేటర్లూ రిపేరు చేసే షాపులో పనికి కుదిరాడు కైలాష్, తోటి కుర్రాళ్లు పగలంతా పనిచేసి రాత్రికి ఏ

సినిమాకో వెళ్తుంటే కైలాష్ మాత్రం అర్ధరాత్రి దాకా పని చేసేవాడు. నైపుణ్యం పెంచుకునేవాడు. అతని ఆసక్తి చూసిన

యజమాని ముంబయిలో ప్రత్యేక శిక్షణ ఇప్పించాడు. ఐదారేళ్లు అక్కడ పనిచేసి దాచుకున్న రూ. 15వేలతో సొంతంగా షాపు

పెట్టుకున్నాడు. కైలాష్ పనిలో ఆతడి నైపుణ్యం తెలిసినవారంతా వెతుక్కుంటూ అతని షాపుకే రావడంతో త్వరగానే

నిలదొక్కుకున్నాడు. ఆ తొలి విజయం అతడిలోని వ్యాపారవేత్తని తట్టి లేపింది. కంప్యూటర్ల నిర్వహణ పనిని చేపట్టాడు. పాతికేళ్ల

క్రితం సంగతిది. అప్పుడే కంప్యూటర్ల వాడకం పెరుగుతోంది. ఏడాదికి ఇంతని మాట్లాడుకుని కంప్యూటర్ల బాగోగులు చూసుకోవటం

కైలాష్ పని. ఎలాంటి శిక్షణా లేని అతడు ఇందులో నిలదొక్కుకోవడం కష్టమే అయింది. ఇళ్ల దగ్గర కంప్యూటర్లు ఉన్నవారిని

ఒప్పించి ఒక్కరొక్కరుగా ఖాతాదార్లను పెంచుకున్నాడు. కొన్నాళ్లకి పెద్ద పెద్ద కంపెనీలు కూడా అతడి ఖాతాదార్లయ్యాయి. వైరస్ వచ్చి

పనిచేయని కంప్యూటర్ ని ఫార్మాట్ చేసి తిరిగి పనిచేయించడానికి చాలా టైమ్ పట్టేది. సాఫ్ట్ వేర్ తో ఆ సమస్యను పరిష్కరించుకోవటం

తేలిక. కానీ విదేశీ సాఫ్ట్ వేర్లు ఖరీదు ఎక్కువని చాలామంది అవి కొనకుండా కైలాష్న ఫార్మాట్ చేసివ్వమని అడిగేవారట. ఈ అవసరం

పెరగడమే కానీ తగ్గదని గుర్తించిన కైలాష్ చిన్నతమ్ముడిని పుణెలో కొత్తగా ప్రారంభమైన కంప్యూటర్ కోర్సులో చేర్పించాడు. తానూ కొన్ని

కోర్సులు చేశాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి పగలూ రాత్రీ కష్టపడి తక్కువ ధరకే యాంటీవైరస్

సాఫ్ట్ వేర్లు తయారుచేశారు. కానీ వాటిని అమ్మడమెలాగో తెలియక, చేతిలో డబ్బులేక ఒక దశలో

అన్నీ మూసేసి పాత రిపేర్ల దుకాణంలోకి వెళ్లిపోదామనుకున్నారు. చివరి ప్రయత్నంగా

మూడు నెలలు గడువు పెట్టుకుని స్నేహితుడి సలహాతో మార్కెటింగ్ కోసం ప్రత్యేక సిబ్బందిని

నియమించాడు కైలాష్ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 1988లో కైలాష్

ప్రారంభించిన కంప్యూటర్ సెంటర్ పన్నెండేళ్ల క్రితం 'క్విక్ హీల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గా

మారి ఐపీవోకి వెళ్లింది. దేశవిదేశాల్లో పాతికకు పైగా శాఖలతో 1500 మంది

సిబ్బందితో రూ.800 కోట్ల నికర విలువ గల ఆ కంపెనీ సీఈవో

ఒకప్పుడు

రేడియో

మరమ్మతులు చేసేవాడంటే నమ్మడం కష్టమే, కానీ వాస్తవం. అందుకే, కష్టపడితే

సాధ్యం కానిదేదీ లేదు... అంటాడు కైలాష్,

No comments:

Post a Comment