పేదరికమే పెద్ద సమస్య అనుకుంటే దానికి కులవివక్ష కూడా తోడైనప్పుడు... ఆ కష్టాలు ఎలా ఉంటాయో
అశోక్ ఖాడేకి బాగా తెలుసు. మహారాష్ట్రలోని ఆ మారుమూల పల్లెలో చనిపోయిన పశువుల చర్మం ఒలిచి
చెప్పులు కుట్టడం తప్ప మరో పని చేయకూడదు తండ్రి. ఆరుగురు పిల్లల్ని కని పెంచుతున్న తల్లి చేతనైన
రోజున పొలం పనులకు వెళ్లేది. ఆమె తెచ్చిన కూలీ డబ్బులు తిండికి చాలక వారంలో మూడు రోజులు
పస్తులే ఉండేవారు. ఆ ఆరుగురు సంతానంలో ఒకడైన అశోక్ తానో కంపెనీ పెడతాననీ దాదాపు ఐదు వేల
మందికి ఉపాధి కల్పిస్తాననీ కలలో కూడా అనుకోలేదు.
ఓరోజు పెద్దవాన కురుస్తోంది. అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకుని పిండి తేవడానికి వెళ్లాడు అశోక్. తల మీద గోనె
పట్టా సరిచేసుకుంటుంటే పిండి ప్యాకెట్ నీళ్లలో పడిపోయింది. పిండంతా కొట్టుకుపోయింది. బిక్కమొహం వేసుకుని ఇంటి
కొస్తే ఇక ఆ పూటకి తినడానికి ఏమీలేదని నిస్సహాయంగా చెప్పింది తల్లి. పస్తులు అలవాటే అయినా తన వల్ల తమ్ముళ్లూ చెల్లెళ్లూ ఏడుస్తూ
పడుకున్న ఆ రోజుని అశోక్ ఇప్పటికీ మర్చిపోలేదు. పల్లెలో పస్తుల బతుకు చాలనుకున్న అశోక్ తండ్రి ముంబయి చేరుకున్నాడు. ఒక చెట్టు
కింద కూర్చుని చెప్పులు కుట్టేవాడు. కొన్నాళ్లకు అశోక్ అన్న కూడా ముంబయి వెళ్లి ఓడల్ని నిర్మించే మజగావ్ డాక్కర్డులో వెల్డర్‌గా పనికి
కుదిరాడు. ఆ తర్వాత అశోక్ వంతు వచ్చింది. తనూ వెళ్లి అన్న దగ్గరే సహాయకుడిగా చేరాడు. అందరూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా
తిండికి సరిపోని పరిస్థితులు అశోక్ ని ఆలోచింపజే సేవి. అందుకే పనిచేస్తున్నా చదువుని నిర్లక్ష్యం చేయకుండా పదో తరగతి పూర్తిచేశాడు.
ఇక ఆ తర్వాత అతని వల్ల కాలేదు. అయితే డాక్కర్డులో పని అతడికి చాలా నేర్పింది. నైపుణ్యాలను నేర్చుకున్నాడు. పరిచయాలను
పెంచుకున్నాడు. విధినిర్వహణలో భాగంగా ఓసారి జర్మనీ వెళ్లాడు. పల్లెలో పుట్టి పెరిగిన అతడికి ముంబయి నగరానికి రావటమే గొప్ప,
అలాంటిది విదేశీ ప్రయాణం కూడా చేయగలగడం అతడి ఆలోచనా పరిధిని విస్తృతం చేసింది. సొంతంగా తానే వ్యాపారం చేయాలన్న ఆలోచనను
రేకెత్తించింది. 1992లో ముగ్గురు అన్నదమ్ముల పేర్లలోని మొదటి అక్షరాలతో ఉపఎస్ ఆఫ్షోర్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని
ప్రారంభించాడు. అశోక్. చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులతో మొదలు పెట్టి మెల్లగా సొంతంగా కాంట్రాక్టులు చేపడుతూ నిదానంగా ఎదిగిన ఈ సంస్థ
సముద్రంలో చేపట్టే నిర్మాణాలకు ఫ్యాబ్రికేషన్ పనీ, చమురు అన్వేషణకు అవసరమయ్యే పరికరాల తయారీ చేస్తుంది. దాదాపు ఐదు వేల
మంది సిబ్బందితో వేలకోట్ల ప్రాజెక్టుల్ని సమర్ధంగా నిర్మిస్తున్న అశోక్ ఊరినీ అక్కడి అనుభవాల్ని మాత్రం మర్చిపోలేదు.
ఒకప్పుడు ఏ ఊళ్లో అయితే 'మా వీధిలోకి రావద్దు, మా గుడిలోకి రావద్దు...' అని అశోక్న అతని కుటుంబాన్ని దూరంగా ఉంచారో ఇప్పుడా
ఊళో శిథిలమైపోయిన గుడిని పునరుద్ధరించాడు అశోక్. తల్లి కూలీగా పనిచేసిన చోటే వందెకరాలను కొన్నాడు. అక్కడో ఆస్పత్రిని పాఠశాలనీ
ఇంజినీరింగ్ కళాశాలనీ కూడా కట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు.
I wondered upon your blog and wanted to say that I have really enjoyed reading your blog posts. Thanks for sharing. I hope you post again soon.
ReplyDeleteOffshore Engineering Services India