Thursday, 19 November 2020

SRI PREM GANAPATHI ,PREMSAGAR DOSE PLAZA, MUMBAI.

 


వచ్చామన్నది కాదు, ఏం చేయగలమన్నదే ముఖ్యం. లక్ష్యం మీద దృష్టి పెట్టి కష్టపడితే ఏదైనా

తోపుడు బండి మీద మొదలైన ప్రేమ్ గణపతి ప్రయాణం ఇప్పుడు డెబ్బైకి పైగా శాఖలతో 30కోట్ల

టర్నోవరుతో దోసె అభిమానుల నోరూరిస్తూ ముందుకు సాగుతోంది. మనం ఏం చదివాం, ఎక్కడినుంచి

దోసె పాజా... తోపుడు బండితో మొదలైంది!

ఒకోసారి జీవితం కల్పన కన్నా సృజనాత్మకంగా ఉంటుంది. ఊహకందని మలుపులు

తిరుగుతుంది. లేకపోతే.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, భాష రాని ప్రాంతంలో కట్టుబట్టలతో

ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ పది హేడేళ్ల కుర్రాడు వ్యాపారవేత్త అవుతాడని ఎవరైనా

ఊహించగలరా! 'అసలు తిరిగి సొంతూరు వెళ్లి నావాళ్లను చూస్తాననే అనుకోలేదు - అంటాడు

ఇప్పుడు దేశవిదేశాల్లో డెబ్భైకి పైగా శాఖలతో 30 కోట్ల టర్నోవరుతో నడుస్తున్న 'దోసె ప్లాజా'

గొలుసు రెస్టరెంట్ల వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి.

తమిళనాడులో ఒక కూలీ ఇంట పుట్టిన ప్రేమ్ కి ఏడుగురు తోబుట్టువులు.. ప్రభుత్వ పాఠశాలలో

పదో తరగతి దాకా చదివాడు. ఆ పైన చదవాలంటే పట్నం వెళ్లాలి, అందుకు డబ్బు కావాలి. ఒక

పక్కన ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి పెట్టడమెలా అని తల్లి బాధపడుతోంటే తాను

చదువుకుంటానని అడగలేకపోయాడు. ప్రేమ్. చేసేది లేక చదువు కలలు మానేసి చెన్నై వెళ్లి

కూలిపనులు చేశాడు. రోజంతా కష్టపడ్డా నెలకి రెండు మూడొందలకన్నా ఎక్కువొచ్చేవి కావు.

అందులోనే కొంత ఇంటికి పంపించేవాడు. ముంబయి వెళ్తే మంచి పనులు దొరుకుతాయనీ నెలకు

1200 జీతం వస్తుందనీ స్నేహితుడు చెప్పడంతో తల్లిదండ్రులకు చెప్పకుండా రైలెక్కాడు. అక్కడ పని

చూపించకపోగా ప్రేమ్ దగ్గరున్న డబ్బంతా తీసుకుని పారిపోయాడు స్నేహితుడు. తిరిగి చెన్నై వద్దామంటే

చేతిలో డబ్బుల్లేవు. ఎవరినన్నా అడగాలంటే భాష రాదు. ఓడిపోయి ఇంటికెళ్లడానికి మనసొప్పలేదు. ఓ తమిళ

వ్యక్తి సాయంతో 150 రూపాయల జీతంతో హోటల్లో ప్లేట్లు కడిగే పనికి కుదిరాడు. తన పని తాను చేస్తూనే హోటల్ పనిచేస్తున్న తీరుని

పరిశీలించేవాడు. ఎక్కడ ఏ అవసరం వచ్చినా గబుక్కున అందుకుని హోటల్ యజమానికి కుడిభుజంలా ఉండేవాడు. అలా రెండేళ్లు పనిచేసి

కొంత డబ్బు దాచుకున్నాడు. ఓ స్నేహితుడితో కలిసి సొంతంగా టీ కొట్టు పెట్టాడు. వచ్చీ రాని హిందీలో సరదాగా కబుర్లు చెబుతూ

వినియోగదారులను ఆకట్టుకునేవాడు. ప్రేమ్. టీ కొట్టులో బాగానే డబ్బురావటం చూసిన స్నేహితుడికి దాన్ని ప్రేమ్ తో పంచుకోవటం ఇష్టం

లేకపోయింది. మరోసారి మోసపోయి ఖాళీ చేతులతో మిగిలాడు ప్రేమ్. అయితే ఈసారి అతడు భయపడలేదు. హోటల్ పనులన్నిట్లో

ఆరితేరాడు కాబట్టి త్వరగానే పని దొరికింది. మళ్లీ కొన్నాళ్లు కష్టపడి పదిహేను వందలు దాచుకున్నాడు.

ఈసారి ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా వెయ్యిరూపాయలతో వంట పాత్రలు కొని 150 పెట్టి తోపుడు బండి అద్దెకు తీసుకుని

రైల్వే స్టేషన్ దగ్గర ఇడ్లీ,

దోసె వేసి అమ్మడం మొదలెట్టాడు. తక్కువ ధరకే రుచిగా, శుచిగా ప్రేమ్ వండి పెట్టే ఆ టిఫిన్లు చాలామందికి

సచ్చాయి. కొంచెం డబ్బు సమకూరడంతో ధైర్యం వచ్చిన ప్రేమ ఒక గది అద్దెకు తీసుకుని ఇద్దరు తమ్ముళ్లను తోడు తెచ్చుకున్నాడు.

అవటానికి తోపుడు బండే అయినా నీట్ గా ఒకేలాంటి దుస్తులు వేసుకుని తలకు టోపీలు పెట్టుకుని శుభ్రంగా వంట చేసే ఈ అన్నదమ్ముల్ని

చూసి అందరూ ముచ్చటపడేవారు. వ్యాపారం బాగా జరుగుతోందనుకుంటున్న సమయంలో మున్సిపల్ వాళ్లిచ్చి బండి లాక్కెళ్లేవారు. ప్రతిసారీ

డబ్బు కట్టి విడిపించుకోవాల్సి వచ్చేది. అలా ఎన్నోసార్లు జరిగాక ఇలా

అయితే లాభం లేదనీ అక్కడ కట్టే డబ్బేదో అద్దెకు పెట్టుకుంటే మంచి

పూల్ నడుపుకోవచ్చని భావించాడు ప్రేమ్. కాస్త రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని 'ప్రేమ్ సాగర్ దోసె ప్లాజా' పేరుతో టిఫిన్ హోటల్ ని

ప్రారంభించాడు. హోటల్ కి వచ్చే కాలేజీ కుర్రాళ్లతో స్నేహం చేసి హిందీ, ఇంగ్లిష్ భాషలూ ఇంటర్నెట్ వాడడమూ నేర్చుకున్న ప్రేమ్ ఇక

వెనక్కి తిరిగి చూడలేదు. యూట్యూబ్ లో చూసి, ప్రయోగాలు చేసి 105 వెరైటీల

దోసెలు వేసేవాడు. ప్రేమ్ ఉత్సాహానికి తగ్గట్టే

వినియోగదారులూ ఇష్టంగా తిని మెచ్చుకునే వారు. ఏదైనా మాల్ కి వెళ్లినప్పుడు అక్కడి మెక్ డొనాల్డ్ రెస్టరెంట్ ని చూసి

ఎప్పటికైనా అలాంటి దోసె షాపు పెట్టాలనుకునేవాడు ప్రేమ్. సెంటర్ వన్ మాల్ యజమాని ప్రేమికి ఆ అవకాశాన్ని

సాధించొచ్చు... అని అనుభవంతో చెబుతాడు ప్రేమ గణపతి.

No comments:

Post a Comment