మహిళా జన అధికార్ సమితి,అజ్మీర్, రాజస్థాన్.
డిజిటల్ యుగానికి అనుగుణంగా గ్రామీణ మహిళలకు నైపుణ్యాలను అందించడానికి ఎం జె ఏ ఎస్ చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఒక భాగం. మొదట అన్హాద్ ఫిలిమ్స్ వీరికి శిక్షణ ఇచ్చింది .ఇప్పుడు డిజిటల్ రంగంలో అగ్రగామిగా ఉన్న పీర్ నేతృత్వంలోని మోడల్ విజయవంతం అయింది. వీరి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఇప్పుడు ఇతరులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. బాల్యవివాహాల సంకెళ్లలో చిక్కుకొని కష్టాల పాలైన అజ్మీర్ గ్రామీణ మహిళలు ఇప్పుడు చిన్న చిన్న సినిమాలను రూపొందిస్తున్నారు .డిజిటల్ యుగానికి అనుగుణంగా ఈ గ్రామీణ మహిళలు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకుని మహిళా కార్మికుల దయనీయ జీవితాలు గృహహింసపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయడమే కాదు.. చాలావరకు విజయం సాధించారు కూడా . వీరు తమ ఆలోచనలను సినిమా రూపకంగా గ్రామీణుల ముందుకు తీసుకువచ్చి సరికొత్త జీవన విధానం గురించి అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ రంగంలో నైపుణ్యం సాధి ంచిన వీరు శిక్షకులుగా మారి మారుతున్న గ్రామీణ భారతానికి ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజస్థాన్లోని అజ్మీర్ లో అత్యంత సామాన్యంగా ఉండే రెండు అంతస్తుల భవనం ఉంది .అక్కడ ప్రతి ఉదయం ఒక నిశ్శబ్ద విప్లవం మేల...