SRI PC MUSTHAFA,CEO ID FRESH, KERALA.
కేరళలోని ఓ మారుమూల గ్రామం పీసీ ముస్తఫాది. తండ్రి రోజుకూలీ. వాళ్లుండే ఊరికి రోడ్డు లేదు, కరెంటు లేదు. బడికి ఆరు మైళ్లు నడిచి రోజుకూలీ కొడుకుని హార్వర్డ్ మెచ్చింది.. తిండి తినడం ఎరగని వ్యక్తి ఇప్పుడు ఇడ్లీ, దోసె పిండిని ప్యాకెట్లలో విక్రయిస్తూ వెయ్యి కోట్ల బ్రాండుని సృష్టించాడు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు. కష్టపడాల్సిందేనని ముస్తఫాకి చాలా చిన్నప్పుడే తెలిసింది. ఉద్యోగంలో చేరేదాకా ఏనాడూ మూడు పూటలా వెళ్లే క్రమంలో చిన్నారి ముస్తఫా బుర్ర చాలా ఆలోచనలు చేసేది. డబ్బు సంపాదించడానికి పెద్దయ్యేదాకా ఆగడమెందుకని వేసవి సెలవుల్లో తన ఖర్చులకు ఉంచుకుని తండ్రికి కొంత ఇచ్చేవాడు. ఆ యావలో పడి ఆరో తరగతి ఫెయిలైన కొడుకుని చదువు మానేసి కూలికి రమ్మన్నాడు తండ్రి కొడుకూ సరేనన్నాడు. స్కూలు టీచరు కలుగజేసుకుని చదువుకుంటే జీవితం బాగుపడుతుందని నచ్చజెప్పడంతో చదువు కొనసాగించాడు. సెలవుల్లో పనులకు వెళ్లి తండ్రికి తన వంతు సాయం చేస్తూనే పది పాసయ్యాడు. తండ్రి స్నేహితుడు ఉచిత వసతి కల్పిస్తే ఒక పూట తినీ ఒకపూట తినకా పట్నంలో ఇంటర్ చదివాడు. ఎన్ని కష్టాలొచ్చినా చదువు మాననని టీచరుకిచ్చిన మాట ప్రకారం ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. నెల...