వచ్చామన్నది కాదు, ఏం చేయగలమన్నదే ముఖ్యం. లక్ష్యం మీద దృష్టి పెట్టి కష్టపడితే ఏదైనా తోపుడు బండి మీద మొదలైన ప్రేమ్ గణపతి ప్రయాణం ఇప్పుడు డెబ్బైకి పైగా శాఖలతో 30కోట్ల టర్నోవరుతో దోసె అభిమానుల నోరూరిస్తూ ముందుకు సాగుతోంది. మనం ఏం చదివాం, ఎక్కడినుంచి దోసె పాజా... తోపుడు బండితో మొదలైంది! ఒకోసారి జీవితం కల్పన కన్నా సృజనాత్మకంగా ఉంటుంది. ఊహకందని మలుపులు తిరుగుతుంది. లేకపోతే.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా, భాష రాని ప్రాంతంలో కట్టుబట్టలతో ఒంటరిగా చిక్కుకుపోయిన ఓ పది హేడేళ్ల కుర్రాడు వ్యాపారవేత్త అవుతాడని ఎవరైనా ఊహించగలరా! 'అసలు తిరిగి సొంతూరు వెళ్లి నావాళ్లను చూస్తాననే అనుకోలేదు - అంటాడు ఇప్పుడు దేశవిదేశాల్లో డెబ్భైకి పైగా శాఖలతో 30 కోట్ల టర్నోవరుతో నడుస్తున్న 'దోసె ప్లాజా' గొలుసు రెస్టరెంట్ల వ్యవస్థాపకుడు ప్రేమ్ గణపతి. తమిళనాడులో ఒక కూలీ ఇంట పుట్టిన ప్రేమ్ కి ఏడుగురు తోబుట్టువులు.. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి దాకా చదివాడు. ఆ పైన చదవాలంటే పట్నం వెళ్లాలి, అందుకు డబ్బు కావాలి. ఒక పక్కన ఇంట్లో అందరికీ కడుపు నిండా తిండి పెట్టడమెలా అని తల్లి బాధపడుతోంటే తాను చదువుకుంటానని అడగలేకపోయాడు. ప్ర...