పెన్ ఆంటీ.. రతన్ బామ్మ@పుణె
నడక తడబడుతున్న చేతులు వణుకుతున్న ఎండ వానలను లెక్క చేయకుండా కొందరు వృద్ధులు పనులు చేస్తుంటారు. పేదరికం వల్ల, తప్పనిసరై ,బిడ్డలకు భారం కాకుండా, తాము ఒక చేయి వేయాలని కష్టం చేయడానికి వాళ్లు రోడ్డు ఎక్కుతారు. ఏవైనా వస్తువులు అమ్మడం, హస్తకళా రూపాలు తయారు చేయడం, పాటతోను, వాద్యంతోను, అలరించడం చేస్తూ ఉంటారు. ప్రతిఫలంగానే తప్ప ఉచితంగా డబ్బు తీసుకోరు. సిగ్నల్ దగ్గర, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ఇ లలో ఇలాంటి వారు ఎందరో కనిపిస్తుంటారు. కాకపోతే చూసే వారే తక్కువ, ఫోను తెరని తప్ప మరి దేనిని అంతగా పరిశీలించి చూసే అలవాటు తప్పిన ఈ రోజులలో ,ఆ ఫోన్ ద్వారా నే ఆ వృద్ధులకు తమ వంతు సహాయం చేస్తున్నారు కొందరు. నిజమైన హీరోలు వన్ టూ సామాజిక మాధ్యమాలలో వారు పంచుకుంటున్న ఫోటోలు మన సమాజం గురించి ఎన్నో విషయాలు చెబుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు బెగ్ - ప్లీజ్ బై మై పెన్స్అంటూ ప్లకార్డ్ పట్టుకున్న వృద్ధురాలు ఆత్మ గౌరవానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. మహారాష్ట్రలోని పూణేలో పెన్ ఆంటీ గా పేరు పొందిన రతన్ బామ్మ కొన్ని నాళ్ళ క్రితం సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యింది. పెన్ను 10 రూపాయలు అంటూ బోసి నోటితో నవ్వ...